పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లితోనే భార్యాభర్తలు ఒక్కటై కొత్త జీవితానికి ప్రారంభిస్తారు. అయితే పెళ్లిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అడవుల్లో నివసించే తెగల సంప్రదాయాలు ఇంకాస్త భిన్నంగా ఉంటాయి. అలాంటి వింత ఆచారాల గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. దక్షిణ ఫసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పెళ్లిలో పెళ్లి కూతురిని ఎంచుకునే విధానం గురించి మీకు తెలిస్తే అందరూ షాక్‌కి గురవుతారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని ప్రాంతాల్లో.. అడవుల్లో.. దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నారు. అడవుల్లో ఉండటం వల్ల వారు.. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయలనే పాటిస్తుంటారు. సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా.. వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, తదితర అంశాలను మనం గమనించే ఉంటాం. కానీ దక్షిణ పసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగ వింత ఆచారాన్ని పాటిస్తోంది.
పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. అమ్మాయి వక్షోజాలను చూసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే వింత ఆచారాన్ని పాటిస్తారు. ఒకవేళ ఆ యువతి వక్షోజాలు యువకుడికి నచ్చకపోతే నిర్మొహమాటంగా కాదని చెప్పవచ్చు. అలాంటి ప్రాచీన ఆచారాన్ని ఆ తెగ వాళ్లు ఇప్పటివరకు పాటిస్తుండటం గమనార్హం. యువతి ఛాతీని చూసి పెళ్లికి ఒప్పుకోవడం చూస్తుంటే.. ఈ తెగ ప్రజలకు వివాహంపై పెద్దగా ప్రాధాన్యత చూపనట్లు కనిపిస్తోంది.
ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ ఇలాంటి వింత ఆచారాలు పాటించడం సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. పెళ్లి చూపుల నెపంతో వచ్చిన ప్రతి యువకుడికి యువతి తన ఎద అందాలను చూపించడాన్ని నిర్మూలించాలని కోరుతున్నారు. ఇలాంటి వింత ఆచారాల వల్ల ఆ తెగ మనుగడకు ముప్పు వాటిళ్లుతుందన్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని అంటున్నారు.