వీధికుక్కలకు కోట్ల ఆస్తి.. ఎక్కడంటే..?

-

చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే వాటికి బర్త్ డే లు సెలబ్రేట్ చేసి, పెళ్లి చేసి, చనిపోతే వాటిని పూడ్చి ఓ మెమోరియల్ కట్టే అంత. పెట్ డాగ్స్ తో లవ్ లో పడిన వారంతా వాటిని తమ ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తారు. ఇంట్లో ఓ మనిషిలా ఆ పెట్స్ కూడా వాళ్లలో ఒకరిలా కలిసిపోతాయి. వాళ్లతోనే తింటూ.. వాళ్ల పక్కనే పడుకుంటూ.. టీవీ చూస్తూ.. ఆడుతూ మనుషుల్లానే ఎంజాయ్ చేస్తాయి. కానీ స్ట్రీట్ డాగ్స్ అలా కాదు.

 

వీధి కుక్కల జీవితం చాలా బాధాకరం. వాటికి తినడానికి తిండి ఉండదు. ఉండటానికి చోటు ఉండదు. వాటిని పట్టించుకునే వారు లేకపోగా.. వాటిని దుర్మార్గంగా కొట్టి చంపుతారు కొందరు. కొందరేమో విషయం పెట్టి చంపేస్తారు. ఇంకొందరు వాటితో వికృత చేష్టలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. మనం ప్రతిరోజు పేపర్ లో మర్డర్లు, హత్యలు, అత్యాచారాల గురించి చదవడం ఎంత కామన్ అయిపోయిందే కుక్కలపై మనుషుల దాష్టీకం గురించి వార్తలు రావడం కూడా అంతే సాధారణమైపోయింది.

వీధికుక్కలను ఇలా దారుణంగా హింసిస్తున్న మన సమాజంలో కొందరు మానవతావాదులు కూడా ఉన్నారు. వీధికుక్కలకు అక్కున చేర్చుకుని వాటి ఆలనాపాలనా చూసేవారున్నారు. వారికి సరైన తిండి పెడుతూ వ్యాక్సిన్స్ వేయిస్తూ.. వాటిని తమ ఫ్యామిలీలా చూసుకుంటారు. అందరిలా ఇంట్లో పెట్స్ గా పెంచుకోకపోయినా రోజులో ఒకసారైనా వాటి గురించి పట్టించుకుంటారు. ఇలా ఓ గ్రామంలోని ప్రజలు వీధికుక్కల కోసం చేసిన పని గురించి తెలిస్తే వాళ్లని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ వాళ్లేం చేశారంటే..?

ఓ గ్రామంలోని కుక్కలకు రూ.కోట్ల ఆస్తి ఉంది. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా పాలన్‌పుర్‌ తాలూకా కుశాకల్‌ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమి కేటాయించారు. ఎకరంలో మూడోవంతైన ఒక్క బీఘా భూమి విలువ అక్కడ సుమారు రూ.25 లక్షలు. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.5 కోట్లు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని శునకాల కోసమే ఖర్చు చేస్తూ.. ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు.

గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడినవే. నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్థులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధికుక్కలకు కేటాయించారు. భూమిని అందరూ కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు.

పండుగల సమయంలో శునకాలకూ మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కుక్కల ఆహారం తయారీకి గ్రామస్థులు పెద్ద పెద్ద పాత్రలను కొనుగోలు చేశారు. ఈ సంప్రదాయం తమ పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుశాకల్‌ గ్రామస్థుడు ప్రకాశ్‌ చౌదరి తెలిపారు. కుక్కల కోసం రోజూ 10 కిలోల పిండితో రొట్టెలు చేస్తామని హితేశ్‌ చౌదరి చెప్పారు. వీళ్లని చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారుగా. హ్యాట్సాప్ కుశాకల్ ప్రజలు అనాలనిపిస్తోందిగా.. మాక్కూడా అలాగే అనిపిస్తోంది. శెభాష్ కుశాకల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version