ఆదివారం వస్తుందంటేనే మనకు అదొక ఉత్సాహం వస్తుంది. శని, ఆదివారాల్లో అసలు పని చేయబుద్ది కాదు. ఆదివారం అంటే సెలవుదినం, ఆరోజు హ్యాపీగా చికెన్, మటన్ లాంటివి తెచ్చుకుని తినాలే, తాగేలే ఎంజాయ్ చేయాలే అలా కాకుండా ఆఫీస్‌కు వెళ్లాలన్నా, కాలేజీకు వెళ్లాల్సి వచ్చినా మనకు అస్సలు నచ్చదు. కానీ ఆదివారం అసలు సెలవుదినం కాదట. ఇలా ఆదివారం సెలవు దినం అవ్వడం వెనుక ఒక కారణం ఉంది అదేంటంటే..

అప్పట్లో మన దేశములో ఆదివారం సెలవు రోజు కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో సామెతగా మారి -‘అమావాస్యకో పున్నమికో’ అంటుంటాము కదా? అలా. ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తిమంతమైన దినం. మనకు ఆ రోజు సూర్యారాధన దినము, చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళుట.భారతీయులు మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును ఇచ్చేవాళ్లట.
అలా అలా ఇపుడు ఆదివారం అంటే సెలవు రోజు, మందు మాంసాల దినంగా మారింది. కానీ అంతకు ముందు ఆ రోజు మనకు ఓ సుదినం . అప్పటిలో వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి నాలుగు దినాలు అనగా పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు.
ఆదివారం నాడు విధిగా సూర్యోపాసన చేసేవారు. మనకు ప్రపంచంలో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆయుర్వేదం ప్రకారం.. ఆదివారం రోడు అసలు మాంసాహారం తినకూడదట. ఈ విషయం ఎవ్వరికి చెప్పినా అస్సలు వినరు. కానీ ఏం చేస్తాం మనం చిన్నప్పటి నుంచి ఆదివారాన్ని ఒక సెలవుదినంగా అలవాటు చేసుకుని బాడీకి, మైండ్‌కు రెస్ట్ ఇస్తూ వచ్చేశాం.
