దేవుడా..ఇలాంటి పెళ్లిని ఎప్పుడు చూసి ఉండరు..

-

పెళ్ళి అంటే చాలు గత రెండు నెల ముందు నుంచి హంగామా ఉంటుంది.. ఎలా వచ్చిన వాళ్ళను చూసుకోవాలి.మర్యాదలు తక్కువ అయితే మాటలు వస్తాయి. ఫోటోలు ఎలా తీయించుకోవాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయి.తమకు ఉన్నంతలో ఖర్చుపెట్టి, బంధుమిత్రులందరినీ పిలిచి చాలా ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుతారు..అయితే ఓ జంట మాత్రం సింపుల్ గా ఎంగేజ్మెంట్ అని బంధువులకు చెప్పుకున్నారు.ఎంగేజ్మెంట్ మాత్రమే చేసుకుంటున్నట్లు బంధువులకు చెప్పి వీరు మ్యారేజ్ చేసుకున్నారు.

అయితే ఈ సర్ ప్రైజ్ మ్యారేజ్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా అని అవాక్కవడం వారి వంతయింది. ఇందుకు సంభందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కోడుతుంది..ఈ వీడియోకి ఇప్పటికే లక్షల వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు ఏర్పాటు చేసిన సర్ ప్రైజ్ మ్యారేజ్ కి చాలామంది ప్రజలు రావడం చూడొచ్చు. ఆ తర్వాత ఇది ఎంగేజ్మెంట్ పార్టీ కాదని నిజంగా పెళ్లి అని తెలుసుకొని వారి ఆశ్చర్యపోవడం కూడా గమనించవచ్చు..

ఈ వధూవరులు పెళ్ళి ఉంగరాలు ధరించి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రేమగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ వధువు పేరు జానెల్ కాగా, వరుడు పేరు మైక్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజీ తెలిపింది. 2020లో ఒకరికొకరు ప్రేమలో పడ్డారట. పరిచయమైన రెండు నెలల్లో వారు కలిసి జీవించడం స్టార్ట్ చేశారు. ఎనిమిది నెలల తర్వాత వారు నిశ్చితార్థం చేసుకున్నారు..ఈ వీడియో పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు పెడుతున్నారు. పెళ్ళికి వెల్దామని అనుకున్న వారి పరిస్థితి ఏంటీ అంటూ ఫన్ని కామెంట్లు చేస్తున్నారు..నిజంగానే ఇలాంటి పెళ్ళి అందరికి భలే థ్రిల్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version