IND VS RSA : సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు నెలకోల్పారు. నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచారు. సూర్య కేవలం 39 ఇన్నింగ్స్ లోనే 15 సార్లు 50+ పరుగులు చేశారు. ఆ తర్వాత స్థానంలో మోర్గాన్(14), మ్యాక్స్ వెల్(11), బెర్రింగ్టన్(10), ఫిలిప్స్(10) ఉన్నారు.
కాగా, మూడు టి20 సిరీస్ ను టీమిండియా సమం చేసింది. ఇందులో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా… 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ ఇండియా జట్టు 106 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మిల్లర్ 35 పరుగులు, ఆ జట్టు మర్క్రం 25 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు 5 వికెట్లు పడ్డాయి. జడేజా రెండు వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టి20 సిరీస్ ను 1-1 తేడాతో టీమిండియా సమం చేసింది.