కరోనా లాక్ డౌన్ ఉంది. బయటకు రాకూడదు, మరి ఏం చెయ్యాలి. పేద వాళ్లకు ఏమో గాని కాస్త డబ్బు ఉండి జనాల్లో తిరిగే వాళ్లకు మాత్రం ఇప్పుడు లాక్ డౌన్ చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకి కరోనా పెరగడంతో లాక్ డౌన్ ని ఇప్పట్లో ఆపేసే అవకాశం లేదు. దీనితో కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు. తాజాగా ఇద్దరు భార్యా భర్తలు ఆడుకుంటున్న క్రికెట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లా మెజత్తూర్ గ్రామానికి చెందిన రామన్ నంబూద్రికి 58 ఏళ్ళు. భారత సైన్యంలో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆయన భార్య బిందు ఓజుకిల్(50) సంస్కృత ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ఈ ఇద్దరికీ ఏం చేయ్యాలో అర్ధం కాక ఇంటి పెరట్లో పిల్లలతో కలిసి ఆట ప్రారంభించారు. కాసేపటికి బౌలింగ్ వేసే వంతు ఆయన భార్య బిందుకి వచ్చింది.
ఆమె ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్‌గా చేతిని తిప్పుతూ వేసిన బౌలింగ్ చూసి షాక్ అయ్యారు. ఇక భర్త జాగ్రత్తగా వికెట్ పడకుండా డిఫెన్స్ ఆడాడు. వారి అబ్బాయి ఈ ఆటను చూసి మురిసిపోయి ఈ మ్యాచ్‌ని సెల్‌ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. టీచర్ గారి బౌలింగ్ చూసి షాక్ అయ్యారు అందరూ. వీడియోలో ఆమె ఎక్కడా కూడా అలసిపోయినట్టు కనపడలేదు.