ముస్లింల కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఇప్పుడు రంజాన్ పండగ వచ్చింది. ముస్లింలకు నిన్న నెలవంక కనపడటంతో ఉపవాసాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో పవిత్ర రంజాన్ మాసం కోసం ముస్లిం కరోనా రోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్ష చేసే ముస్లిం సోదరుల కోసం గానూ… వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఫుడ్‌ను అందించడానికి సిద్దమయ్యారు. షెహరి, ఇప్లార్ విందుల్లో ముస్లిమ్‌లకు వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని అందిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన రంజాన్ మెనూ శనివారం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నారు.

తెల్లవారుజామున 3.30 గంటలకు ఉపవాసదీక్షను ఆరంభించనున్న నేపథ్యంలో కరోనా బారినపడ్డ ముస్లిం పెషంట్లకు అప్పటికే భోజనాన్ని అధికారులు సిద్దం చేసి ఉంచుతారు. ఆ సమయంలో వారు తినడానికి గానూ… షెహరిగా రొట్టేలు, వెజ్ కర్రీ, దాల్ అందిస్తారు. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో కిచిడీ, చికెన్ కర్రీ, భగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అధికారులు అందిస్తారు.

అంతే కాకుండా మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వారికి వడ్డిస్తారు. అల్ఫాహారం మెనుగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను వారికి ఇవ్వనున్నారు అధికారులు. అంతే కాదు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ ముస్లిమేతర పెషంట్లను వేరే గదిలోకి తరలించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ప్రార్ధనలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకు ఇబ్బంది రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version