చక్రాలపై బట్టల దుకాణం.. గిన్నిస్ రికార్డు అందుకున్న దుబాయ్ రిటైలర్..

-

దుబాయ్ కి చెందిన తెలాల్ ఫ్యాషన్ స్టోర్ అరుదైన గిన్నిస్ రికార్డు అందుకుంది. చక్రాలపై అతిపెద్ద బట్టల దుకాణాన్ని స్థాపించినందుకు గాను ఈ రికార్డు సాధించింది. వినియోగదారుల కోరిక మేరకు గడప వద్దకే బట్టల దుకాణాన్ని తీసుకొస్తున్న అతిపెద్ద సంస్థగా రికార్డు అందుకుంది. తెలాల్ జెంట్స్ ఫ్యాషన్ రిటైల్ సంస్థకి మిడిల్ ఈస్ట్ లో మొత్తం 32 ఔట్ లెట్లు ఉన్నాయి. అంతేకాదు ఇటలీ పాదరక్షల సంస్థ కూడా ఉంది. గిన్నిస్ రికార్డు అందుకున్న సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడిన దాని ప్రకారం చక్రాలపై బట్టల దుకాణాన్ని నెలకొల్పడానికి కారణాలు ఈ విధంగా వివరించారు.

కరోనా వల్ల బట్టల అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. దాదాపుగా 30శాతం అమ్మకాలు తగ్గాయి. అదీగాక లాక్డౌన్ నిబంధనలు కూడా ఉండడంతో జనాలు ఇంట్లో నుండి బయటకి రాకుండా పోయారు. కరోనా భయం ఫ్యాషన్ మీద ఖర్చుని బాగా తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఈ మొబైల్ ఫ్యాషన్ స్టోర్ ఆలోచన వచ్చిందని అన్నారు. ప్రస్తుతం దాదాపు మిడిల్ ఈస్ట్ అంతటా ఈ మొబైల్ ఫ్యాషన్ స్టోర్ ఉందని, వినియోగదారులకి కావాల్సిన అన్ని అవసరాలను వారి గడప వద్దకే తీసుకొస్తున్నామని తెలిపారు.

దీనివల్ల అమ్మకాలు బాగా పెరిగాయని, దాదాపుగా 50శాతం అమ్మకాలు జరిగాయని, మునుపటి కంటే ఇప్పుడు వ్యాపార స్థితి బాగుందని వివరించారు. తెలాల్ ఫ్యాషన్ రిటైల్ తీసుకువచ్చిన సరికొత్త ప్రాజెక్టుల్లో ఈ మొబైల్ ఫ్యాషన్ రిటైల్ చాలా చక్కటి విజయాన్ని అందుకుందని అది మాకు గర్వంగా ఉందని తెలిపారు. మొత్తానికి కరోనా కారణంగా ఆన్ లైన్ వ్యాపారాలు విపరీతంగా పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version