ఆ రెండు జిల్లాల్లో క‌నుమ‌రుగ‌వుతున్న టీడీపీ.. జ‌గ‌న్ దెబ్బ ఇలా ఉంటుందా?

-

తెలుగుదేశం పార్టీ అంటే ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ‌మైన పార్టీ. గ‌త 40ఏళ్ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. 20ఏండ్ల‌కు పైగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో దుకాణం క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఏపీలోని రెండు జిల్లాల్లో కూడా ఇదే ప‌రిస్థితి తలెత్తేలా క‌నిపిస్తోంది.

 

జగన్ దెబ్బకు ఏపీలోని పలు జిల్లాల్లో టీడీపీకి ఉనికే లేకుండా పోతోంది. ఆ జిల్లాల్లో సరైన నాయకత్వం లేకుండా పోతోంది. అంతో ఇంతో ఆ పార్టీకి ప‌ట్టు ఉందంటే అది కోస్తా జిల్లాల్లో మాత్ర‌మే. కానీ రాయలసీమ జిల్లాల్లో మాత్రం టీడీపీ అస‌లు ఉందా అనే అనుమానం క‌లుగుతోంది.

తెలంగాణలో ఏ విధంగా అయితే టీడీపీ ఎలా కనుమరుగైపోయిందో ఇప్పుడు రాయ‌ల‌సీమలో కూడా అలాగే కనుమరుగయ్యేలా ఉంది. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో అయితే టీడీపీ జెండా కూడా క‌న‌ప‌డ‌ట్లేదు. ఇంత‌కు ముందు కూడా ఈ జిల్లాల్లో టీడీపీకి పెద్దగా బలం లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మ‌రింత దారుణంగా త‌యార‌యింది. 2019 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్విప్‌ చేసింది. అయితే ఎన్నిక‌లు వ‌చ్చి రెండు ఏళ్లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ టీడీపీ ఏ మాత్రం కోలుకోలేక‌పోతోంది. స‌ర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో కూడా ఒక్క సీటు గెల‌వ‌లేక‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. ఇలాగే కొన‌సాగితే ఈ పార్టీకి రాయ‌ల‌సీమ‌లో భ‌విష్య‌త్ క‌ష్ట‌మే.

Read more RELATED
Recommended to you

Exit mobile version