ప్రాణాలకు తెగించి బాలిక ప్రాణాలను కాపాడిన ఆర్మీ..హ్యాట్సాప్..!

-

మన దేశాన్ని కాపాడటం మాత్రమే కాదు మనుషుల ప్రాణాలను కూడా ఎంతో రిస్క్ చేసి కాపాడుతున్నారు. ఇటీవల దేశాన్ని కుదిపేసిన వరదల లో చిక్కుకున్న ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.ఇప్పుడు మరోసారి రియల్ హీరోలు అయ్యారు.700 అడుగుల లోతుల్లో పడిన ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు..ఈ విషయం పై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

విషయాన్నికొస్తే.. గుజరాత్‌లో సురేంద్ర నగర్ జిల్లా గజన్వావ్ గ్రామంలో తవ్వి ఉంచిన ఓ బోరుబావిలోకి 12 ఏళ్ల బాలిక పడిపోయింది. అయితే భారత ఆర్మీ బృందం కొన్ని గంటలపాటు శ్రమించి ఆ పాప ప్రాణాలను కాపాడింది. అనంతరం ఆమెని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధ్రంగధ్ర తాలుకాలోని గంజన్వావ్‌లో 600 నుంచి 700 అడుగులు ఉన్న బోర్‌వెల్లోకి మనీషా అనే బాలిక ప్రమాద వశాత్తు పడిపోయింది. అలా పడిపోయిన అమ్మాయి 60 అడుగుల వద్ద బాలిక చిక్కుకుపోయింది. ఉదయం 7 గంటల సమయంలో బాలిక పడిందని తెలుస్తుంది.

అక్కడకు చేరుకుని బోరు బావిలోకి ఆక్సిజన్ను సరఫరా చేశారు. కెమెరాల సాయంతో బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్ ధృంగాద్రలో ఉన్న ఆర్మీని ఒక బృందాన్ని నియమించమని అభ్యర్థించగా ఓ ఆర్మీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలిక నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బాలికను రక్షించి.. ఆపై చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమెను కొంతకాలం పరిశీలనలో ఉంచుతామని అధికారులు చెప్పారు.. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గా ఉంది.. ఆర్మీ సమయానికి చేరుకొని బాలిక ప్రాణాలను కాపాడారని ఆ గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు..ఇప్పుడు ఈ వార్త చక్కర్లు కొడుతోంది.. గతంలో అందులో ఓ బాలుడు కూడా పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు..అప్పుడు కూడా ఆర్మీ రిస్క్ చేసి బాలుడిని కాపాడారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version