మహా కుంభమేళాకు వెళ్లే వారికి బిగ్ అలర్ఠ్. మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్ చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారిపోయాయి. మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్ చోటు చేసుకుంది. దీంతో 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయి.
ఇక అటు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు సగటున 1.44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే సుమారు 44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక పండుగలో భాగమవుతున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండడంతో యోగి సర్కార్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.
మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో రద్దీ
100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు pic.twitter.com/wuIvo7mHNc
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025