ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 24న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి.
అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాలను సుమారు 20 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై BACలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.