ఆ గుడ్డు ధర రూ. 78 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు ఇవే..!

-

ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఒక గుడ్డు ధర కోట్లల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా..?
ఆ గుడ్డు ధర ఏకంగా 78 కోట్లు. ఇవి తినే గుడ్లు కావులేండి. ఒకవేళ ఇవి తినే గుడ్లు అయినా మనం అంత కాస్ట్‌ ఉన్నాయి కాబట్టి కచ్చితంగా తినం. అసలు ఈ గుడ్లు ఎందుకు ఇంత కాస్ట్, అంత ప్రత్యేకం ఏం ఉందో చూద్దామా..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గుడ్లను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిలో ఈ గుడ్లు మొదటి స్థానంలో ఉన్నాయట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు రోత్‌స్‌ చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ ఎగ్స్. ఈ గుడ్డు ధర 9.6 మిలియన్ డాలర్లు. అది మన కరెన్సీలో అయితే అక్షరాలా రూ.78 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం ఈస్టర్ గుడ్డుపై అనేక రకాల వజ్రాలు పొదగబడి ఉంటాయి. అలాగే దీనిపై బంగారు కవచంతో కప్పబడి ఉంటుంది. ఈ గుడ్డు తినడానికి కాదు.. కేవలం అలంకరించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ రెండవ స్థానంలో

మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ ధర 8.4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 69 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ గుడ్డుపై 1000 వజ్రాలు పొదిగి ఉంటాయి. ఈ గుడ్డును చూస్తే మీ ముందు ఓ పెద్ద వజ్రం మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంది.

మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్

డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ ధర దాదాపు రూ.82 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈస్టర్ గుడ్లలో ఇది కూడా ఒకటని నిపుణులు అంటున్నారు. 65 సెంటీ మీటర్ల పొడవు ఉంటుంది. ఈ గుడ్డు చాక్లెట్ లాగా ఉంటుందట. దీనిపై కూడా వజ్రాలు, బంగారం పొదగబడి ఉంటాయి.

ఇంత ఖరీదైన గుడ్లు కేవలం అలంకారం కోసమే డబ్బున్న వాళ్లు తీసుకుంటారు. ఇవి వాళ్ల దగ్గర ఉండటం లగ్జరీకి సింబల్‌గా ఫీల్‌ అవుతారట.!

Read more RELATED
Recommended to you

Exit mobile version