అక్కడ జాతరలో డజన్ల కొద్దీ విషసర్పాలను మెడలో వేసుకుని తిరుగుతారట..!

-

జాతరలో కోళ్లు మెడలో వేసుకుని తిరగడం చూసి ఉంటారు. ఆఖరికి మేకను కూడా ఎత్తుకుని తిరుగుతారు. కానీ విషసర్పాలను మెడలో వేసుకుని తిరగడం గురించి మీరు ఎక్కడైనా విన్నారా..? జనరల్‌గా జాతర అంటే ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు. ఇలా పాములను మెడలో వేసుకుని ఊరేగుతుంటే చూసే వాళ్లు ఎలా ఫీల్‌ అవుతారో..? అసలు ఇలాంటి జాతర ఎక్కడ జరుగుతుందంటే..

 

 

బీహర్‌లోని సమస్తిపూర్‌లో విషసర్పాలను ఏమాత్రం భయం లేకుండా మెడలో వేసుకుంటారు. అంతటితో ఆగకుండా వీటితో గండక్ నదిలోకి దిగి మరీ స్నానం చేస్తారు. కొందరు వీటిని తీసుకుని అలానే స్థానిక దేవాలయంకు వెళ్తారు. ఇక్కడ జాతరలో పాల్గొనడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

విషసర్పాలు ప్రజల చేతులకు, మెడకు చుట్టుకునే జాతర. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు చేరుకున్న ప్రజలు పాములన మెడలో వేలాడుతూ ఉండడం చూసి షాక్‌ అవుతారట. గండక్ నదిలో స్నానం చేస్తే పాములను చేతిలో పెట్టుకుని బయటకు వస్తారని చెబుతారు. పాములు తన స్నేహితులంటూ మెడకు, చేతులకు చుట్టుకుని ఉంటాయి.

శ్రావణమాసంలో నాగ పంచమి రోజున జిల్లాలోని విభూతిపూర్ సింఘియా ఘాట్‌లో కొన్నేళ్లుగా ఈ జాతర జరుగుతుందని సమాచారం. భగత్ రామ్ సింగ్ మాతా విశ్వ హరి అని పేరు పెట్టుకుని ఆలయం నుండి డజన్ల కొద్దీ పాములను బయటకు తీసినట్లు సమాచారం. వాటిలో చాలా విషసర్పాలు ఉన్నాయి.

ఒక్క పామును చూస్తేనే మనకు భయం వేస్తుంది. అక్కడ డజన్ల కొద్దీ పాములను మెడలో వేసుకుని తిరుగుతున్న దృశ్యాలను చూస్తే నిజంగా జాతరే. అమ్మవారి మీద నమ్మకంతో ఇలా చేస్తుంటారు. అయితే ఆ పాములు ఎప్పుడైనా ఎవర్ని అయినా కేటేశాయా, వాటి వల్ల ఏదైనా హాని జరిగిందా అనేది మాత్రం బయటకు రాలేదు. అలాగే జాతర తర్వాత ఆ పాములను ఏం చేస్తారో కూడా తెలియడం లేదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version