ప్రపంచంలో మందుబాబులు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే ఇండియా ఏ స్థానంలో ఉందంటే..

-

ఏ వ్యాపారంలో అయినా లాస్‌ వస్తుందేమో అన్న భయం ఉంటుంది కానీ వైన్స్‌ పెడితే మాత్రం కళకళలాడిపోతుంది బిజినెస్‌. అయితే ఈ వ్యాపారం స్టాట్‌ చేయడానికే పైసలు ఎక్కువ కావాల్సి వస్తుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్నారు. ఒక వ్యక్తి సగటున ఏడాదిలో 9.8 లీటర్లు మించకుండా స్వచ్చమైన ఆల్కహాల్‌ తీసుకుంటే ఎలాంటి హాని జరగదని నిపుణులే అంటున్నారు. అంటే వంద గ్లాసుల వైన్‌కు సమానం. ఏడాది మొత్తంలో వంద గ్లాసుల లోపు వైన్‌ తాగొచ్చనమాట.! ఇండియాలో తాగుబోతులు ఎక్కువ, అందరూ తాగేస్తుంటారు అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రపంచంలో తాగుబోతుల లిస్ట్ తీస్తే మన దేశంలో చాలా దూరంలో ఉంది తెలుసా..?

అత్యధిక తాగుబోతులు కలిగిన దేశంగా కుక్ ఐలాండ్స్ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇండియా మాత్రం 111వ స్థానంలో ఉంది. కుక్ దీవుల్లో ప్రజలు ఏడాదికి సగటున 12.97 లీటర్ల ఆల్కహాలన్‌ను తాగుతున్నారట. ఇది సూచించిన మొతాదుకు దాదాపు 28 శాతం ఎక్కువని అమెరికాలోని CIA విడుదల చేసిన నివేదిక వెల్లడించారు.

ఇక మన ఇండియన్ మందుబాబులైతే ఏడాదికి సగటునా కేవలం 3.09 లీటర్ చొప్పున ఆల్కహాల్‌ తాగుతున్నారట. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్‌లో పొందుపరిచేందకు గాను CIA ఈ సమాచారాన్ని 2019లో 266 దేశాల నుంచి సేకరించింది.

12.9 లీటర్లతో లాత్వియా రెండో తాగుబోతు దేశంగా నిలవగా.. 12.73తో చెక్ రిపబ్లిక్ మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది.

మొదటి ఐదు స్థానాల్లో లిథువేనియా 11.93, ఆస్ట్రీయా 11.9 స్థానం సంపాదించాయి.

జర్మనీ 19 స్థానానికి పరిమితమైంది. వీరు కేవలం 10.56 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.

అమెరికా ఈ విషయంలో వెనకనే ఉంది. అమెరికన్లు తాగుబోతులుగా 35వ స్థానంలో నిలిచారు. వీరు ఏడాదికి సగటున కేవలం 8.9 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.

ఆల్కహాల్ వినియోగంలో బాగా వెనుకగా ఉన్న దేశాల్లో ఆసియా దేశాలనే చెప్పుకోవచ్చు.

ఆసియా దేశాల్లో బంగ్లాదేశ్, కువైట్, మౌరిటానియా, సౌది అరేబియా చిట్టచివర ఉన్నాయి.

సోమాలియన్లు అయితే అసలు మద్యమే తాగడం లేదట.

ఆధ్యాత్మిక ప్రదేశం నేపాల్ కూడా 0.36 లీటర్లతో 167వ స్థానంలో ఉంది.

మనం పాకీస్థానీల కంటే ఎక్కువే తాగుతున్నాం. ఎందుకంటే వారు 0.04 లీటర్లతో 180వ స్థానంలో ఉన్నారు.

శ్రీలంకన్లు మన కంటే తక్కువే తాగున్నారు. 2.58 లీటర్లతో వారు 122 స్థానంలో ఉన్నారు.

చైనీయులు అయితే 4.48 లీటర్ల ఆల్కహాల్ వినియోగంతో 89 వస్థానంలో నిలిచారు.

సాధారణంగా వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొత్తం ఆల్కహాల్ కూడా మూడు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో తాగవచ్చు. అంతా ఒకేసారి తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం ఆరు మీడియం సైజు గ్లాసుల వైన్ లేదా ఆరు పింట్ల బీర్‌కు సమానం. ఈ లీటర్ల లెక్కలన్నీ స్వచ్ఛమైన ఆల్కహాల్‌కు సంబంధించినవి. అంటే దాదాపు 300 లీటర్లన్న మాట.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యప్తంగా 2.3 బిలియన్ల జనాభా ప్రస్తుతం తాగుబోతులుగా ఉన్నారు. ప్రపంచ వ్యప్తాంగా మొత్తం మరణాల్లో ఐదు శాతానికి పైగా ఆల్కహాల్ హానికరంగా వినియోగించడం వల్లనే సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version