ఈరోజుల్లో చాలామంది అబ్బాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడూ కూడా సరైన వయసులో పెళ్లి చేసుకోవాలి. ఉద్యోగం వచ్చాక చేసుకుందాం లేదంటే ఇంకా ఏదో చదువుకుందాం.. లేకపోతే శాలరీ పెరిగిన తర్వాత చేసుకుందాం జీవితం సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని చాలా మంది అబ్బాయిలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ నిజానికి అది తప్పు. వీలైతే 30 దాటకుండా పెళ్లి చేసుకోవడం మంచిది. చాలా మంది 30 దాటిన తర్వాత 35 లోపు పెళ్లి చేసుకుందామని అలా పోస్ట్ పోన్ చేస్తున్నారు.
కానీ పెళ్లి జీవితంలో ఇబ్బందులు వస్తాయి పెళ్లి సరైన సమయానికి చేసుకోవాలి. ఆలస్యంగా చేసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లిని ఆలస్యం చేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయని గుర్తు పెట్టుకోండి. బిజీ లైఫ్ వలన పెళ్లి ఆలస్యం అయిపోతుంది 30 దాటి పోయినా సరే పెళ్లి చేసుకొని వాళ్ళు ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకోండి.
30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. పిల్లలు పుట్టడంలో కూడా ఇబ్బందులు వస్తాయి. స్త్రీలలో గర్భధారణ సామర్థ్యం పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. పెళ్లి కనుక ఆలస్యమైతే పిల్లలకి యుక్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు బాగా పెద్ద వాళ్ళు అయిపోతారు. బాధ్యతలు కూడా తీర్చుకోలేకపోతుంటారు అలాగే ప్రేమ జీవితం పై ఆసక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 30 తర్వాత కంటే ముందే పెళ్లి చేసుకోవడం మంచిది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయని గుర్తు పెట్టుకోండి.