ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా చిన్న చిన్న గొడవలు రావడం సహజమే. ముఖ్యంగా భార్య భర్తలు మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. అయితే అవి కొంత సమయానికి సర్దుకుపోతే ఎంతో ఆనందంగా ఉండవచ్చు. కానీ చాలా శాతం మంది భార్య భర్తలు గొడవలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించరు. పైగా చాలా మాటలు కోల్పోతారు. దీంతో ఎలాంటి పరిష్కారం ఉండదు, కనుక మీ బంధం దృఢంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని మార్పులను చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ప్రియమైన వారితో గొడవ జరిగిన తర్వాత మీ రిలేషన్షిప్ పై ఎలాంటి ప్రభావం ఉండదు.
భార్యాభర్తలు మధ్య ఎలాంటి గొడవలు జరిగినా బంధువులకు సంబంధించి ఎటువంటి విషయాలను గొడవలోకి తీసుకురాకూడదు. ఇలా చేయడం వలన బంధువులపై గౌరవం తగ్గిపోతుంది మరియు ఆ మాటలను ఎప్పటికి మర్చిపోరు. కనుక ఎలాంటి సందర్భంలో అయినా బంధువులు, సోదరులు మరియు తల్లిదండ్రులు చెప్పిన విషయాలను గొడవలో అస్సలు చెప్పకూడదు. ఏ బంధంలో అయినా గొడవలు వస్తూఉంటాయి అయితే అటువంటి సమయంలో ఇరువురి లోపాలను మాత్రమే చూడడం వలన పరిష్కారం ఉండదు. ముఖ్యంగా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదని గుర్తుంచుకోవాలి. కేవలం లోపాలను చూడడం వలన సంతోషాన్ని అస్సలు పొందలేరు.
గొడవలు జరిగినప్పుడు ఒకరి భావాలను మరొకరు గౌరవించాలి మరియు ఎంతో సహనంతో వ్యవహరించాలి. ఎప్పుడైతే ఒకరికొకరు సమయాన్ని కేటాయిస్తారో, వాళ్ళ అవసరాలకు మరియు అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తిస్తారో గొడవలు రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి మధ్య విశ్వాసం అనేది ఉండాలి. భావాలను వ్యక్తం చేయడం వలన ఎన్నో సమస్యలు తగ్గుతాయి. కనుక అస్సలు మౌనంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకుంటారో ఆ బంధం మరింత బలపడుతుంది. కనుక ఎక్కువ సమయాన్ని గడపడం, వ్యక్తిగత అభిరుచులు మరియు కొత్త పనులు చేయడం గురించి మాట్లాడడం వంటివి చేయాలి. ఈ విధంగా మీ రిలేషన్షిప్ ఎంతో సంతోషకరంగా ఉంటుంది.