ఆ కంపెనీ ఉద్యోగుల ల‌క్ ఏంటో తెలుసా..? వారికి వారంలో కేవ‌లం 4 రోజులే ప‌ని ఉంటుంది..!

-

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌క‌లిస్ అనే లీగ‌ల్ కంపెనీ త‌న ఉద్యోగుల‌కు వారంలో ఏకంగా 3 రోజుల పాటు సెల‌వుల‌నిస్తోంది. కేవ‌లం 4 రోజుల పాటు మాత్ర‌మే ఆ ఉద్యోగులు ఆ కంపెనీలో ప‌నిచేయాలి.

ప్ర‌పంచంలో దాదాపుగా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా, ఎంత పెద్ద సంస్థ అయినా స‌రే.. వారంలో ఉద్యోగుల‌కు మ‌హా అయితే గ‌రిష్టంగా 2 రోజుల వ‌ర‌కు మాత్ర‌మే సెల‌వులు ఇస్తాయి. ఐటీ ఉద్యోగుల‌కు 2 రోజులు క‌చ్చితంగా వారంలో సెల‌వులు ల‌భిస్తాయి. కానీ ఇత‌ర ఏ ఉద్యోగులు అయినా స‌రే వారంలో 6 రోజులు ప‌నిచేయాల్సిందే. వారికి కేవ‌లం 1 రోజు మాత్ర‌మే సెల‌వు ఇస్తారు. కానీ మీకో విష‌యం తెలుసా..? బ‌్రిట‌న్‌లోని ఆ కంపెనీ మాత్రం త‌న ఉద్యోగుల‌కు వారంలో 1, 2 కాదు ఏకంగా 3 రోజులు సెల‌వులు ఇస్తోంది. అంటే.. ఆ కంపెనీలో ఉద్యోగుల‌కు వారంలో కేవ‌లం 4 రోజులే ప‌న‌న్న‌మాట‌. ఇక మిగిలిన ఆ 3 రోజులు ఉద్యోగులు హాయిగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌క‌లిస్ అనే లీగ‌ల్ కంపెనీ త‌న ఉద్యోగుల‌కు వారంలో ఏకంగా 3 రోజుల పాటు సెల‌వుల‌నిస్తోంది. కేవ‌లం 4 రోజుల పాటు మాత్ర‌మే ఆ ఉద్యోగులు ఆ కంపెనీలో ప‌నిచేయాలి. అయితే మ‌రి జీతం త‌గ్గిస్తారా.. అంటే అదేం కాదు. జీతం కూడా య‌థావిధిగానే ఇస్తారు. అందులో ఏమాత్రం కోత ఉండ‌దు. కానీ ప‌నిదినాలు మాత్రం నాలుగే ఉంటాయి. అయితే ఆ కంపెనీ ఇలా ఉద్యోగుల‌కు వారంలో కేవ‌లం 4 రోజులు మాత్ర‌మే ప‌నిక‌ల్పించ‌డం వెనుక కార‌ణం ఉంది. అదేమిటంటే..

వారంలో కేవ‌లం 4 రోజుల పాటు మాత్ర‌మే ప‌ని ఉండ‌డం, మిగిలిన 3 రోజులు సెల‌వు ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కంపెనీ ఉద్యోగులు బాగా ప‌నిచేస్తున్నార‌ట‌. అంటే.. వారంలో 6 రోజుల పాటు చేసే ప‌నిని కేవ‌లం 4 రోజుల్లోనే చేస్తున్నార‌ట‌. దీంతో కంపెనీ ఉత్పాద‌క‌త బాగా పెరుగుతుంద‌ని ఆ కంపెనీ డైరెక్ట‌ర్ ట్రేవ‌ర్ వ‌ర్త్ చెబుతున్నారు. అలాగే సిబ్బంది ఉత్సాహంగా ప‌నిచేస్తున్నార‌ని, అల‌స‌ట తగ్గిపోతుంద‌ని అంటున్నారు. ఇక త‌మ కంపెనీ ప్రాథ‌మిక ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే ఉద్యోగులు గ‌తంలో క‌న్నా ఇప్పుడు బాగా ప‌నిచేస్తున్నార‌ని, వారు చాలా ఆనందంగా కూడా ఉన్నార‌ని, క‌స్ట‌మ‌ర్ల‌కు నాణ్య‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నార‌ని తెలిపారు. అవును మ‌రి.. అన్ని రోజుల పాటు సెల‌వు ఉంటే.. స‌హ‌జంగానే ఎవ‌రికైనా ఒత్తిడి ఉండ‌దు. ఉత్పాద‌క‌త కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా ఆ కంపెనీ ఉద్యోగులు పెట్టి పుట్టారు క‌దా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version