ఈ ప్రపంచంలో ఎన్నో రకాలు పక్షులు ఉన్నాయి. పక్షి స్వచ్ఛత, శాంతికి చిహ్నం. స్వయం కృషితో గూడు కట్టుకుని ఆకాశంలో స్వేచ్చగా ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతూ తింటాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని పక్షులు చూడ్డానికి కాస్త భయంకరంగా కూడా కనిపిస్తాయి. పక్షులలో ప్రమాదకరమైన పక్షులు కూడా ఉన్నాయి. డేగ, రాబందు వంటి ప్రమాదకరమైన పక్షుల పేర్లను మనం విన్నాం. రాబందు కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ పక్షి కూడా అంతే ప్రమాదకరమైనది. ఈ పక్షి గిన్నిస్ రికార్డులో చేరింది. ఈ పక్షి దాని రంగు కారణంగా, దాని లైఫ్‌స్టాల్ కారణంగానో ఫేమస్ అవలేదు. 2019లో జరిగిన సంఘటన తర్వాత, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పేరుపొందింది.
కాసోవరీ ప్రమాదకరమైన పక్షి :
కాసోవరీ అని పిలువబడే ఈ భారీ పక్షి ఆస్ట్రేలియా మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఈ పక్షి పెద్దగా ఎగరలేదు. 6 అడుగుల ఆరు అంగుళాల పొడవు మరియు 60 కిలోల బరువు ఉంటుంది. చూసేవారి కంటికి ఇవి ఉష్ట్రపక్షి, ఈముల్లా కనిపిస్తాయి. ఏప్రిల్ 12, 2019న, అమెరికాలోని ఫ్లోరిడాలో 75 ఏళ్ల వ్యక్తిపై కాసోవరీ పక్షి దాడి చేసింది. అప్పుడే ఈ పక్షి ప్రమాదకరమైనదని వెలుగులోకి వచ్చింది. వేల సంవత్సరాల క్రితం నుండి మానవులు తమ గుడ్లు, మాంసం మరియు ఈకల కోసం పంజరాలలో కాసోవరీలను ఉంచుతున్నారని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. పాపువా న్యూ గినియాలో కాసోవరీలను నేటికీ పెంపకం చేస్తున్నారు.
ఈ ప్రమాదకరమైన జెయింట్ పక్షి ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఈ పక్షి కాళ్లు ఇతర పక్షుల కంటే భిన్నంగా ఉంటాయి. చాలా పిరికి పక్షి అయినప్పటికీ, ఇది బెదిరించినప్పుడు లేదా దాడి చేసినప్పుడు దాని బలమైన పంజాలను ఉపయోగిస్తుంది. ఈ పక్షి యొక్క పంజా సాధారణంగా 12 సెం.మీ పొడవు ఉంటుంది. ఇది తీవ్రమైన గాయాలు మరియు రక్తస్రావం కలిగిస్తుంది. కొన్నిసార్లు ఈ దాడులు ప్రాణాంతకం కావచ్చు.
ఏప్రిల్ 1926లో, ఫిలిప్ మెక్లీన్ అనే 16 ఏళ్ల వేటగాడు కాసోవరీచే దాడికి గురయ్యాడు. ఈ దాడి జరిగిన 93 సంవత్సరాల తర్వాత, 2019లో, కాసోవరీ పక్షి మళ్లీ దాడి చేసినట్లు కనుగొనబడింది. ఆస్ట్రేలియాలోని బీచ్‌లో కనిపించే ఈ పక్షిని చూసి ప్రజలు భయపడుతున్నారు. ఇది సాధారణ, శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన జీవులలో ఒకటి.