గోమూత్రంతో తలస్నానం, పేడతో బ్రషింగ్.. ఆవులను ప్రాణంగా ప్రేమించే తెగ ఇది

-

భారతీయులకు ఆవు దేవుడితో సమానం.  హిందువులు గోవును పూజిస్తారు.. గోమూత్రం, పేడ, పాలు..ఆవు ఇచ్చే ప్రతి ఉత్పత్తిని మనం ఉపయోగిస్తాము. కానీ మనకంటే.. ఎక్కువ ప్రేమగా..  ఆవును చూసుకునే, తడి ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించే మనలాంటి జాతి ఉంది. భారతదేశ సంస్కృతిని పోలి ఉండే ఒక ప్రత్యేక తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీళ్లు ఆవులను వాళ్ల కుటుంబంలో ఒకరిగా చూడటం కాదు.. వాళ్ల జీవితం, జీవినాధారం ఆవులు మాత్రమే..
ఆవును కంటికిరెప్పలా చూసుకునే జాతి ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్‌లో నివసిస్తున్నారు. వీరు ముండారీ తెగకు చెందినవారు. ఇక్కడ ఆవును కేవలం జంతువుగా చూడరు… ఇది ప్రతిష్టగా పరిగణించబడుతుంది. పశువులే సర్వస్వం అని నమ్ముతారు. వారి జీవితమంతా పశువులపైనే ఆధారపడి ఉంటుంది. పశుసంపద వారి ఆదాయ వనరు. మెషిన్ గన్‌తో పశువులను కాపాడుతారు. పశువులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముండారీ ప్రజలు తమ సర్వం దారపోస్తారు.
చుట్టుపక్కల వారు తమ పశువులను హానికలిగించకుండా.. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు మెషిన్‌గన్‌తో పశువులకు కాపలాగా ఉంటారు. వారి జీవితంలో అత్యంత విలువైనది పశువులు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి సరిపడా ఆహారం అందించాలని వారి నిరంతరం కష్టపడతారు.. ఇక్కడ కొన్ని ఆవులు ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి.
ఇక్కడ పొడవాటి మరియు బరువైన ఆవులు అధిక ధరలను పొందుతాయి. ఈ ఆవుల సగటు ధర 500 డాలర్లు అంటే దాదాపు 42 వేల రూపాయలు. వారు పశువులను వధించరు. తమ పిల్లల పెండ్లిలో పశువులను కట్నంగా ఇస్తారు.
ముండారీ ప్రజలు ఆవుల ద్వారా మాత్రమే ఆదాయాన్ని పొందరు. వారు తమ రోజువారీ జీవితంలో ఆవుల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆవు మూత్రం మురికిని దూరంగా ఉంచుతుందని వారు నమ్ముతారు. గోమూత్రంతో తలస్నానం చేస్తారు. గోమూత్రంలోని యూరిక్ యాసిడ్ తల వెంట్రుకలకు మంచి రంగునిస్తుందని నమ్ముతారు. ఆవు మూత్రం మాత్రమే కాకుండా పేడ కూడా వాడతారు. పేడతో పళ్ళు తోముకుంటారు. పేడను చూర్ణం చేసి నిల్వ చేస్తారు. దోమలను తరిమికొట్టేందుకు పేడ, గోమూత్రాన్ని యాంటీబయాటిక్స్‌ రూపంలో వాడతారు. ఇక్కడి ప్రజలు పశువులతో పడుకుంటారు. పశువులు తోడు లేకుంటే చావుతో సమానమని వారు నమ్ముతారు. ఈ తెగ ప్రజలు ఆవులను చంపడం మహాపాపంగా భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version