కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. మళ్ళీ బీఆర్ఎస్ ను గెలిపిస్తాడు : హరీష్ రావ్

-

తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావ్ కీలక కామెంట్స్ చేసారు. తెలంగాణ అమర వీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుంది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కేసీఆర్ నెంబర్ 1గా నిలిపారు. కానీ రేవంత్ 11 నెలల పాలనలో అధ:పాతాళానికి తీసుకెళ్లాడు.

ఆరు గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలు పెట్టిండు. మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తేవాలి. అంతేగాని గరీబోళ్ల ఇల్లు కూలగొడుతరా.. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదు. ఆరు గ్యారెంటీలు అన్నడు మోసం చేసిండు. పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవు. స్కాలర్ షిప్పులు రేవంత్ రెడ్డి గుండు సున్న చేసాడు. ఒక్క విద్యార్థికి స్కాల్ షిప్పుల డబ్బులు ఇవ్వలేదు. హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామం చేసిండు కేసీఆర్. కాబట్టి రాబోయే రోజుల్లో మనదే కప్. కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తడు. మల్లీ వచ్చి బీఆర్ఎస్ ను గెలిపిస్తాడు అని హరీష్ రావ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version