Parenting Tips : మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పిస్తున్నారా..?

-

కొందరు పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది. పట్టుమని రెండేళ్లు కూడా ఉండవు కానీ దేశాలు రాజధానులు, నదులు, సముద్రాల పేర్లు చెప్పేస్తుంటారు. మరికొందరేమో పట్టుపమని పదేళ్లు కూడా ఉండవు అప్పటికే డిగ్రీ పట్టా చేతపుచ్చుకుంటారు. ఇంకొందరేమో ఏకంగా కోడింగ్​ రాసేస్తూ సాఫ్ట్​వేర్లు క్రియేట్ చేస్తూ యాప్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు కేవలం పాఠాలతో కుస్తీ పడితే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. పిల్లలకు కూడా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ గురించి అవగాహన ఉండాలి. అప్పుడే వారు వారి క్లాస్​రూమ్ నుంచి ఓ అడుగు ముందుకేసి నేటి సమాజం గురించి తెలుసుకుంటారు.
ఇలా చిన్నతనంలోనే సొసైటీ గురించి ఓ క్లారిటీ వస్తే వాళ్లకి తమ లైఫ్​లో ఏం చేయాలో తెలుస్తుంది. అప్పుడు వారు అనుకున్నది చేయడానికి ముందడేగయలుగుతారు. అయితే చిన్నపిల్లలకు ఇదంతా నేర్పడం ఎలాగంటారా..? సరిగ్గా కూర్చొని తినమంటేనే తినరు వీళ్లకి జీకే పాఠాలు నేర్పేదెలాగని తలలుపట్టుకుంటున్నారా..? కంగారుపడకండి.. తల్లిదండ్రులు కాస్త పిల్లలపై శ్రద్ధ పెడితే ఈజీగా మీ పిల్లలను ప్రో లుగా మార్చొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..!

జనరల్‌ నాలెడ్జ్‌.. జీకే చదవడం.. సముద్రానికి ఎదురీదడం ఒకటే. పెద్దవాళ్లకే జీకే చదవాలంటే విసుగొస్తుంది. ఇక పిల్లలెలా చదువాతరంటారా..? అయితే ఈ కాలం పిల్లల్లో ఐక్యూ స్థాయులు మెరుగ్గా ఉన్నాయని, కాస్త ప్రోత్సహిస్తే.. చిన్న వయసులోనే వారు ఈ సబ్జెక్ట్‌లో ఆరితేరే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా చిన్నతనం నుంచే జీకేలో నిష్ణాతులైతే పెద్దయ్యాక వారు ఎలాంటి పరీక్షలోనైనా రాణించగలరని చెబుతున్నారు.


ఈ కాలంలో కొందరు చదవడమంటే బట్టీ పట్టడం అనుకుంటున్నారు. కానీ అలా చేయడం వల్ల ఎంత చదివినా ఎన్ని ర్యాంకులొచ్చినా దండగ. అందుకే చదవింది ఒంటబట్టాలంటే చర్చించాలి. ఒంటరిగా కూర్చొని చదవడం కంటే చుట్టూ ఉన్న వాళ్లతో ఆ సబ్జెక్ట్‌ గురించి చర్చిస్తే ఆ విషయాలన్నీ మన మనసులో నాటుకుపోతాయి. పిల్లలతో జనరల్‌ నాలెడ్జ్‌ చదివించే క్రమంలోనూ తల్లిదండ్రులు ఇదే పద్ధతిని ఫాలో కావచ్చంటున్నారు నిపుణులు. రోజుకో టాపిక్‌ చొప్పున తీసుకొని.. ముందుగా దాన్ని పిల్లలతో ఓసారి చదివించాలి. ఆ తర్వాత అందులోని ముఖ్యమైన అంశాలు, వాటి నేపథ్యం గురించి అందరూ కలిసి చర్చించాలి.. ఇలా చేస్తే పిల్లలు వాటిని మర్చిపోమన్నా మర్చిపోరు. పైగా ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి వారిలో మొదలవుతుంది.

పిల్లలకు టీవీ చూడడమంటే మహా సరదా! అందులోనూ కార్టూన్‌ ఛానల్స్‌ అంటే మరీ ఆసక్తి చూపిస్తారు. తమకు నచ్చిన కార్టూన్‌ క్యారక్టర్స్‌ చెప్పే డైలాగ్స్‌ని ఇట్టే గ్రహిస్తారు. కాబట్టి పిల్లలకు జీకే చెప్పే క్రమంలో కార్టూన్‌ ఛానల్స్‌నే ఆయుధంగా మలచుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చరిత్ర, ఇతిహాసాలకు సంబంధించి రూపొందించిన ‘అర్జున్‌ : ది వారియర్‌ ప్రిన్స్‌’, ‘సింద్‌బాద్‌ : ది సెయిలర్‌’, ‘ఘటోత్కచ్‌’, ‘దశావతార్‌’.. వంటి యానిమేషన్‌ సినిమాలు, నీతి కథలతో రూపొందించిన షోస్‌.. వంటివి పిల్లలకు చూపించచ్చు. అలాగే కార్టూన్‌ క్యారక్టర్లతో రూపొందించిన ‘స్టూడెంట్స్‌ ఎన్‌సైక్లోపీడియా జనరల్‌ నాలెడ్జ్‌’.. వంటి పుస్తకాల్ని పిల్లలకు అందించి రోజుకో కథ చొప్పున వారితో చదివించచ్చు.

ఈ రోజుల్లో చాలా పాఠశాలల్లో జనరల్‌ నాలెడ్జ్‌ని ప్రత్యేక సబ్జెక్ట్‌గా పెట్టి మరీ పిల్లలకు బోధిస్తున్నారు. నిజానికి ఇది మంచి పరిణామమే అని చెప్పాలి. ఎలాగూ స్కూల్లో జీకే చెబుతున్నారు కదా అని ఇంటికొచ్చాక పిల్లల్ని అలాగే వదిలేయకుండా.. ఇంట్లోనూ జీకేకు సంబంధించిన బిట్స్‌ని సరదాగా వారితో ప్రాక్టీస్‌ చేయించచ్చంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులు కాస్త సమయం వెచ్చించి.. ఆ రోజు నేర్చుకున్న అంశంలో నుంచి ప్రశ్నలు అడగడం, క్విజ్‌ పెట్టడం, పాఠ్యాంశంలోని పాత్రల్ని తాము అనుకరిస్తూ – పిల్లలచే అనుకరింపజేస్తూ.. ఇలా సరదాగా ఆడుతూ పాడుతూనే ఆ టాపిక్‌ పిల్లలకు నేర్పించచ్చు. తద్వారా వాళ్లకు నేర్చుకోవాలన్న ఆసక్తీ పెరుగుతుంది.. విషయ పరిజ్ఞానం కూడా అలవడుతుంది.


వీలు చిక్కినప్పుడల్లా పిల్లల్ని మ్యూజియంలకు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి స్థానికంగా ఉండే చారిత్రక స్థలాలకు వెళ్లడం.. అక్కడి ప్రత్యేకతల్ని వివరించడం.. వంటివి చేయడం వల్ల వాళ్లలో జీకే స్కిల్స్‌ని మరింతగా పెంచచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version