200 కిలోమీటర్ల దూరం నుంచి కనపడుతున్న ఎవరెస్ట్…!

-

లాక్ డౌన్ వలన మనకు జరిగిన మేలు కరోనా నుంచి ప్రాణాలతో బయట పడటం ఒకటి అయితే కాలుష్యం కోరల నుంచి తప్పించుకోవడం మరొకటి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ దాదాపు అన్ని దేశాల్లో ఉండటంతో కాలుష్యం అనేది క్రమంగా తగ్గుతుంది. వాహనాలు బయటకు వచ్చే పరిస్థితి ప్రపంచ వ్యాప్తం లేదు. మన దేశంలో గంగా నది సహా అనేక నదుల్లో నీరు చాలా శుభ్రంగా తాగే విధంగా ఉంది.

కరోనా మనకు ఈ విధంగా మేలు చేసింది అనేది వాస్తవం. దాదాపు అన్ని దేశాల్లో కూడా కాలుష్యం అనేది క్రమంగా తగ్గింది అనే చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. బీహార్ లోని ఒక మారుమూల గ్రామం నుంచి ఎవరెస్ట్ పర్వతం కనపడుతుంది. అవును చాలా ఏళ్ళ తర్వాత ఇది కనపడుతుంది. బీహార్‌ ఉత్తరాన ఉండే… సింగ్‌వాహిని గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉంటుంది.

హార్‌లో గాలి కాలుష్యం బాగా తగ్గిపోయింది. అందువల్లే ఎవరెస్ట్ శిఖరం స్పష్టంగా కనపడుతుంది అని అధికారులు చెప్పారు. గాలిని కలుషితం చేసే కార్బొన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి రకరకాల ప్రమాదకర వాయువులు గాలిలో క్రమంగా తగ్గడంతో ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడో కిందటి తరాలు దీన్ని చూసాయని ఈ తరం ఇప్పుడే చూడటమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version