మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నారాయణపేట జిల్లా మాగునూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుఢ్ పాయిజన్ ఘటనలో ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీపిక, నేత్ర అనే 9.వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
అయితే… మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో అరెస్టులకు తెరలేపారు. దీంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక దీనిపై కల్వకుంట్ల కవిత స్పందించారు. చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని ఆగ్రహించారు. ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అంటూ నిప్పులు చెరిగారు.