వైరల్‌ వీడియో: మురికి కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనాలు..!

-

రోడ్డుపై డబ్బులు వెదజల్లడం మీరు చూసే ఉంటారు.. జనాలు క్యూ కట్టి మరీ వాటిని ఏరుకుంటారు.. కానీ ఇక్కడ ఓ మురికి కాలువలో నోట్ల కట్టలు.. అది చూసిన జనం.. ఆ డబ్బు కోసం ఎగబడ్డారు.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!

బిహార్‌లోని ససరం ప్రాంతానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు కాలువలో కరెన్సీ నోట్లు ఏరుకుంటూ వాటిని బయటకు తీస్తున్నారు. మోరాదాబాద్‌ ఏరియాలో ఉన్న ఓ కాలువలోకి కొంత మంది దిగారు. కట్టలు కట్టలు కరెన్సీ నోట్లు తీసుకుని బయటకు వస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 20 మంది ఆ కాలువలో ఉన్నారు. ఓ వృద్ధుడైతే రెండు చేతుల్లో నోట్లు తీసుకుని మురిసిపోయాడు. పరిగెత్తుకుంటూ నీళ్లలో నుంచి వచ్చేశాడు.

రూ.100,రూ.200, రూ.500,రూ.2000 నోట్లు దొరికాయట.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే…అక్కడ నోట్ల కట్టలు ఎలా వచ్చాయన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఎక్కడి నుంచి ఈ నోట్లు వచ్చాయనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అక్కడి గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం…తెల్లవారుజామున కరెన్సీ నోట్ల కట్టలున్న బస్తాలు నీళ్లలో కనిపించాయి. ఇది చూసి ఒక్కసారిగా జనాలు అక్కడ గుమిగూడారు. మురికి నీళ్లు అని కూడా చూడకుండా లోపలికి వెళ్లిపోయి వాటిని ఒడిసి పట్టుకున్నారు. ఇవి నకిలీ నోట్లు అని కొంత మంది కొట్టి పారేసినా…గ్రామస్థులు మాత్రం అవి నకిలీ నోట్లు కాదంటున్నారు.. నకిలీ నోట్లు కూడా కానప్పుడు అంత డబ్బుని కాలువలో ఎందుకు పారేశారన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ అవి నకిలీ నోట్లు కాకపోతే.. ఎందుకు ఇలా చేసి ఉంటారు.. బీహార్‌లో ఇప్పుడు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు పెద్దగా లేవు. ఏసీబీ దాడులు జరుగుతుందే.. తప్పించుకునేందుకు డబ్బును ఇలా చేసి ఉంటారా అనే అనుమానం కూడా ఉంది. ఒకవేళ ఇవి నిజంగా రియల్‌ కరెన్సీ అయితే.. అక్కడి ప్రజలకు పండగే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version