మృతుల కుటుంబాల్లో ఒక్కరికి కాంట్రాక్టు ఉద్యోగం : సీఎం చంద్రబాబు

-

తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికీ కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా.. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికీ రూ.5లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2లక్షలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు. 

తిరుపతిలో తొక్కిసలాట ఘటన తన మనస్సు పూర్తిగా కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలూ జరగకూడదని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దీనిని ఎప్పుడూ కాపాడాలని భక్తుడిగా ఒక సీఎంగా ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడూ తీసుకుంటానన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని టీటీడీ అధికారులతో భేటీ అనంతరం స్పష్టం చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version