వైరల్‌ వీడియో: విద్యార్థుల ఎదుటే జుట్లుపట్టుకోని కొట్టుకున్న టీచర్లు

-

ఉపాధ్యాయులంటే.. క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఈరోజుల్లో కొంతమంది ఉపాధ్యాయుల వల్ల మొత్తం టీచర్లకే చెడ్డపేరు వస్తుంది. విద్యార్థిని కాలుతో తంతాడు ఓ ఉపాధ్యాయుడు.. మరొకరు.. ఆడపిల్లలను కిరాతంగా హింసిస్తాడు.. ఇప్పుడు జరిగింది ఇంకా హైలెట్.. టీచర్లు అందరూ కలిసి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బీహార్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన జరిగింది.. కిటికీ తలుపులు మూయడంపై ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య ఘర్షణ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు (Principal) కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు టీచర్లు కొట్టుకున్నారు. జుట్టుపట్టుకోని.. చెప్పు తీసుకుని రచ్చరచ్చ చేశారు.. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. పొలాల్లో పనిచేసే కొందరు వచ్చి వారిని విడగొట్టారు..

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నరేశ్‌ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. ఏది ఏమైనా.. విద్యార్థుల ముందే.. టీచర్లు ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల.. భవిష్యత్తులో వారిపై విద్యార్థులకు ఏం గౌరవం ఉంటుంది. వారికి మాటకు విలువ ఇస్తారా..?

కేవలం కిటీకి మూయమనడమే ఇక్కడ కారణం కాదు.. వారికి గతం నుంచి విభేధాలు ఉండటంతో.. ప్రధానోపాధ్యాయురాలు అని కూడా చూడకుండా ఇచ్చిపడేశారు. !

 

Read more RELATED
Recommended to you

Exit mobile version