ఎలాంటి రంగంలో అయినా విజయం సాధించాలి అంటే తప్పకుండా ధైర్యం ఉండాలి. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం వంటివి లేకపోతే ఎలాంటి పని ప్రారంభించిన ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన విజయాన్ని సాధించలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సానుకూల ఆలోచనలతో ఉన్న వ్యక్తులు మధ్య ఉండాలి. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని పాటించడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి పొందవచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గుతున్నట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన ఎంతో మనశ్శాంతిని పొందవచ్చు.
మీరు కూర్చునే ప్రదేశంలో వెనుక భాగంలో పర్వతం ఫోటోను ఉంచాలి. ఇలా చేయడం వలన తెలియని ధైర్యం వస్తుంది. వీటితో పాటుగా మూగజీవులకు, పక్షులకు ఆహారాన్ని మరియు నీరుని అందించడం వలన సానుకూల శక్తులు మీకు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరగాలంటే పగడపు రాళ్ళను ధరించాలి. మీ ఇంట్లో పడకగదిలో పరుగు తీస్తున్న గుర్రం వంటి ఫోటో లేక ఉదయిస్తున్న సూర్యుడు ఫోటో ఉంచండి. ఇలా చేయడం వలన నిద్ర లేచిన వెంటనే ఈ ఫోటోలను మీరు చూస్తారు. దీంతో మీకు ఆత్మవిశ్వాసం ఎంతో పెరుగుతుంది.
ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి. కాకపోతే ఈ గుర్రం ఫోటో లో గుర్రం మీ ఇంటి లోపలికి పరిగెత్తుతూ ఉండే విధంగా పెట్టాలి. ఇలాంటి మార్పులు చేయడం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడును ఆరాధించడం మరియు సూర్య మంత్రాలు చదవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన ధైర్యం పెరుగుతుంది. సూర్యుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. వాస్తు శాస్త్రం చెప్పిన ఈ చిన్న మార్పులను తప్పకుండా పాటించండి. దాంతో కాన్ఫిడెన్స్ ను కూడా మీరు పెంచుకోవచ్చు, ఎంతో త్వరగా విజయాన్ని సాధించవచ్చు.