బిజీ లైఫ్ లో ప్రశాంతంగా ఉండాలా? క్షమించడం నేర్చుకోండి

-

రోజువారి జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి, అనుభవాలు ఎదురవుతాయి, వింత వింత మనషులు కలుస్తారు. కొన్ని సంఘటనలు, అనుభవాలు, మనుషులు మనసు మీద గాయాన్ని చేస్తారు. గాయం చిన్నదా, పెద్దదా అనేది పక్కన పెడితే ప్రతీ గాయం గురించి ఆలోచిస్తూ, అది చేసిన వాళ్లపై పగ తీర్చుకోవాలని రగిలిపోతుంటే మీకు ప్రశాంతత ఉండదు.

జీవితం చాలా చిన్నది. జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే.. క్షమించడం నేర్చుకోవాలి. అవును.. ఎదుటి వాళ్లను క్షమించేంత పెద్ద గుణం మీకు ఉంటే మీరు జీవితాన్ని హాయిగా ఆస్వాదించగలుగుతారు.

ఉదాహరణకు మీ స్నేహితుడు ఏదైనా విషయంలో తప్పు చేశాడనుకుందాం. దాన్ని పట్టుకుని మాట్లాడకుండా ఉంటూ లైఫ్ ని గడిపేయకండి. అలా చేయడంవల్ల మీ స్నేహితుడు మీకు ఎదుర్పడ్డప్పుడల్లా మీకు కోపం వస్తుంది. అంత బరువు మీ మీద ఎందుకు ఉంచుకుంటారు. వదిలేయండి, కోపాన్ని వదిలేసి ఫ్రెండ్ తో మామూలుగా మాట్లాడితే మీరు హ్యాపీగా ఉంటారు.

క్షమించడం వల్ల గతం తాలూకు జ్ఞాపకాలను, గాయాలను మీరు మరిచిపోతారు. మనిషికి మరుపు అనేది ప్రకృతిచ్చిన గొప్ప వరం. తలుచుకుంటే గుండె బరువెక్కే, కళ్ళలోంచి నీళ్లు వచ్చే గతాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది.

అలా మర్చిపోవాలంటే క్షమించడం నేర్చుకోవాలి. మొదట్లో చెప్పినట్టు జీవితంలో రకరకాల మనుషులు కలుస్తారు, రకరకాల సంఘటనలు జరుగుతాయి. వాటన్నింటిలో చెడ్డ జ్ఞాపకాలను మరచిపోయి, అవి చేసిన మనుషులను క్షమించేసి జీవించాలి. ఎందుకంటే జీవితం అంటే గడిచిపోయిన గతం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version