గత ఐదేళ్లలో దళితుల సంక్షేమ పథకాలను మాజీ సీఎం జగన్ రద్దు చేసి వారికి వెన్నుపోటు పొడిచారని మంత్రి నిమ్మల రామా నాయుడు విమర్శించారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన రక్తదానం చేశారు. అంతకుముందు ఆసుపత్రి తనిఖీ చేసి పేషెంట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 18 ఏళ్లుగా అంబేద్కర్ వర్థంతి రోజు తమ తండ్రి పేరుతో ఉన్న ధర్మారావు ఫౌండేషన్ పేరిట రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తాను రక్తదానం చేయడం ఇది 24వ సారి అని తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ ను సమర్థంగా అమలు చేస్తే.. వైసీపీ పాలనలో ఆ నిధులను సైతం దారి మళ్లించారు. దళిత వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే.. అతడిని సన్మానించిన ఘనుడు జగన్ అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో దళితులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత టీడీపీది అన్నారు.