ఓ మనిషీ.. నువ్విక మారవా?

-

మనుషులే.. కేవలం మనుషులే.. ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తున్నారు. జంతుజాలాన్ని బతకనీయకుండా చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతంతో జీవవైవిధ్యానికి తీరని అన్యాయం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ విశ్వమండలంలో ఒక్క మనిషి తప్ప మరే జీవం లేకుండా చేస్తున్నాడు. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాడు. ప్లాస్టిక్ ను పెంచి పోషిస్తున్నాడు. నేడు ఈ ప్రపంచం ఎన్నో సమస్యల్లో చిక్కుకుందంటే దానికి కారణం మనిషే. గ్లోబల్ వార్మింగ్ తో రోజు రోజుకూ ఈ భూమి ఎంతో వేడెక్కుతోంది. కాలాలు మారిపోతున్నాయి. వర్షాలు పడాల్సిన టైమ్ కు పడట్లేవు. చలిలేదు. చలికాలంలోనూ ఎండ దంచి కొడుతోంది. ఇలా.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికీ కారణం మనిషి. అవును.. మనిషే వినాశనకారి అని తెలిసిపోతుంది. కానీ.. మనిషి కంటే ఇంకా తెలివైన జీవి ఏదీ లేకపోవడంతో మనిషి చేతిలో తనువు చాలిస్తున్నాయి మిగితా జీవజాలాలు.

దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ తిమింగలం. మీరు పైన ఫోటోలో చూస్తున్న జీవి పేరు స్పెర్మ్ వేల్. తెలుగులో తిమింగలం అనుకుందాం. ప్లాస్టిక్ భూతానికి ఆ జీవి బలైంది. ప్రాణాలు పోగొట్టుకొని ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని కపోటా ఐలాండ్ లో చోటు చేసుకున్నది.

దాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దాని కడుపులోంచి 6 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. వెయ్యి రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే.. ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇలా.. ప్లాస్టిక్ కు సంబంధించిన వ్యర్థాలు దాని కడుపులో ఉండటంతో వాటిని అరిగించుకోలేకనే అది మృత్యువాత పడినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు చెప్పండి.. ఈ తిమింగలం చావుకు ఎవరు కారణం…

Read more RELATED
Recommended to you

Exit mobile version