కొత్తగా పెళ్లైన జంటకు ఏం గిఫ్ట్‌ ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తున్నారా..?

-

పెళ్లి సీజన్‌ మొదలైంది.. దోస్తుగాళ్ల పెళ్లి అంటే.. వాళ్ల కంటే మనకే ముందు ఎక్కువ టెన్షన్.. కొత్త బట్టలు కొనుక్కోవాలి. వాళ్లకు గిఫ్ట్‌ తీసుకెళ్లాలి.. మన బట్టలు అంటే.. మన ఇష్టం వచ్చినవి కొనుక్కుంటాం.. కానీ పెళ్లికి ఏం గిఫ్ట్ తీసుకెళ్లాలి..ఇది పెద్ద ప్రశ్న.. గిఫ్ట్ బాగుండాలి. అది మళ్లీ మన బడ్జెట్‌లోనే ఉండాలి. ఈ రెండింటిని సాటిస్‌ఫై చేయాలంటే కష్టమే..! కొత్తగా పెళ్లైన జంటలకు చాలా రకాల అవసరాలు ఉంటాయి, ఎన్నో అభిరుచులు ఉంటాయి, వారికి ఎవరు ఏ బహుమానం ఇచ్చారో చూడాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే బహుమతి వారిలో సంతోషం నింపుతుంది, మిమ్మల్ని గుర్తుంచుకునేలా చేస్తుంది. అలాంటి కొన్ని ఐడియాస్‌ మీకోసం..

ఇండోర్ మొక్కలు..

ఇండోర్ మొక్కలు, సక్యూలెంట్‌లను బహుమతిగా ఇవ్వడం గొప్ప ఆలోచన. ఈ మొక్కలు ఇంటి చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి. కొత్తగా పెళ్లయిన వారి బెడ్‌రూమ్ లేదా బాల్కనీకి కొత్త హంగులను దిద్దుతాయి. వీటి నిర్వహణకు కూడా పెద్దగా శ్రమ అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా, మీరు కొత్తజంటకు ఇండోర్‌ మొక్కలు ఇస్తే.. వాళ్లు హ్యాపీగా ఫీల్‌ అవుతారు..

సువాసన గల కొవ్వొత్తులు..

కొవ్వొత్తులు కచ్చితంగా ఏదో ఒక సమయంలో వాళ్లకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సువాసనతో కూడిన కొవ్వొత్తులు కొత్తగా పెళ్లయిన వారికి ఒత్తిడిని తొలగించి మంచిగా విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది వారి గదిలో కూడా ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు ఇవి ఇస్తే.. మంచి క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ సెట్‌ చేసుకోవచ్చు.. తక్కువ బడ్జెట్‌లో అవుతుంది.

చెక్క నేమ్ ప్లేట్..

కొత్త నేమ్‌ప్లేట్ ఇవ్వడం కొత్త ప్రారంభానికి సూచిక. మీరు కొత్తగా పెళ్లయిన జంటకు వారి పేర్లతో చెక్కిన నేమ్‌ప్లేట్‌ను బహుమతిగా ఇవ్వండి.. ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో నేమ్‌ప్లేట్లు అందుబాటులో ఉంటాయి. చాలా ఆత్మీయమైన బహుమతి. లేదా చక్కని వాల్ పోస్టర్స్ కలిగిన ఫ్రేమ్స్ ఇవ్వవచ్చు. ఇవి వారి గోడపై అలంకారంగా ఉంటాయి.

డచ్ ఓవెన్..

కొత్తగా పెళ్లిన వారికి కొన్ని గృహోపకరణాలు, వంట సామాగ్రి చాలా మంది ఇస్తారు. అయితే డచ్ ఓవెన్ వంటివి దాదాపు ఇవ్వకపోవచ్చు. కానీ ఇది వారికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. బ్యాచిలర్ జీవితం విడిచి పెళ్లి చేసుకున్నవారు ఇకపై ఇంటి భోజనంపైనే మక్కువ చూపుతారు కాబట్టి కొత్తగా పెళ్లయిన జంటకు డచ్ ఓవెన్‌ను బహుమతిగా ఇవ్వడం సరైన ఆలోచన. నెమ్మదిగా వంట చేయడం, డీప్‌ఫ్రై చేయడం, కుండ రోస్ట్‌లు మొదలైనవన్నీ డచ్ ఓవెన్‌ని ఉపయోగించి చేయవచ్చు.

డిన్నర్ సెట్..

చాలామంది వధువులకు ఇలాండి గిఫ్ట్‌ ఇస్తారు. కొత్తగా పెళ్లయిన జంటకు ఒక జత కపుల్ టీకప్‌లతో పాటు చక్కటి హెర్బల్ టీని బహుమతిగా ఇవ్వండి. చమోమిలే టీ, మందార టీ, నిమ్మకాయ-అల్లం టీ, లావెండర్ టీ, జాస్మిన్ టీ మొదలైనవి మీరు ఎంచుకోగల కొన్ని ఫ్లేవర్లు. హెర్బల్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ప్రశాంతంగా ఉంచుతుంది. తాజాగా తయారుచేసిన జాస్మిన్ టీ ఒక కప్పు కచ్చితంగా కొత్తగా పెళ్లయిన జంటకు గొప్ప విశ్రాంతిని అందించగలదు. లేదా సింపుల్ గా ఒక మంచి డిన్నర్ సెట్ ఇస్తే కూడా ఇది వారి అవసరాలకు ఉపయోగపడుతుంది.

మ్యారెజ్‌ వెడ్డింగ్‌ కార్డ్‌ ఫ్రేమ్‌..

చాలా తక్కువ మందికే ఈ ఐడియా వస్తుంది.. పెళ్లైన వారి జంట ఫోటో ఫ్రేమ్‌ ఎవరైనా ఇస్తారు. కానీ వారి పెళ్లి కార్డునే మీరు ఫ్రేమ్‌గా చేయిస్తే అది ఎప్పటికీ వారికి మధురమైన జ్ఞాపకమే.. పెళ్లి కార్డులు కొన్నిరోజులకు మరుగుణపడిపోతాయి.. కొన్నాళ్లకు అసలు కనిపించవు.. మీరు అలా వారి పెళ్లికార్డునే ఫ్రేమ్‌గా చేయించి ఇస్తే.. అది ఎప్పటికీ వారి మంచి మెమొరీగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version