వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇలా మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..!

-

వాట్సాప్ లో రోజు రోజుకి కొత్త ఫీచర్లు వస్తున్నాయి. వాట్సాప్ ని ఎక్కువ మంది వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా మెసేజెస్ ని పంపుకోవడం మొదలు ఎన్నో లాభాలు పొందొచ్చు. వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీన్ని టెస్టింగ్ కోసం రిలీజ్ చేసారు.

 

ప్రపంచవ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేసారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 1:1 చాట్ ఫీచర్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని కంపెనీ రిలీజ్ చేయనుంది. సెల్ఫ్ మెసేజ్ కూడా వాట్సాప్ లో వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకునే వుంటారు. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు వచ్చేసింది. మనం మనకి ముఖ్యమైనవి పెట్టుకోవచ్చు. లింక్‌లను బుక్‌మార్క్ చేయడానికి మొదలు నోట్స్ రాసుకోవడం దాకా చాలా బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు. ఈ ఫీచర్ ని iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకు వచ్చారు.

ఇక ఈ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలి అనేది చూస్తే.. దీని కోసం ముంది మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ యాప్ స్క్రీన్ కుడి వైపున డౌన్ లో మెసేజ్ బాక్స్ బటన్‌పై నొక్కండి.
కాంటాక్ట్స్ లిస్ట్ వస్తుంది.
కొత్త అప్‌డేట్ తో మీరు మీ నంబర్ కాంటాక్ట్స్ లో వస్తుంది.
ఇప్పుడు మీరు మీ కాంటాక్ట్ పై నొక్కండి.
ఇలా మీరు చాట్‌ని స్టార్ట్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version