అమ్మ ఆ పదంలో ఉన్న మాదుర్యమే వేరు. అమ్మ అనే పిలుపులో ఉన్న తియ్యదనం ,కమ్మదనం వర్ణించలేనిది. మరి అమ్మతనానికి దూరమై వేదన అనుభవిస్తున్నవారిని ఈ రోజుల్లో చాలామందినే చూస్తున్నాం.. ఔనట్టింట్లో పసిపాప తారాడుతుంటే కలిగే అనుభూతికి దూరంగా ఉండటం మానసికంగా వేదనే.. సంతానలేమి అనేది దంపతులు ఇద్దరినీ బాధించేదే. మహిళలను మరింత మనోవేదనకు గురిచేస్తోంది. కారణాలేవైనా మాటలు పడేది మాత్రం ఆడవాళ్లే.. మరి నిజానికి పిల్లలు పుట్టకపోవటానికి కారణం కేవలం ఆడవారేనా.. ఈ సమస్య గురించి కాస్త లోతుగా విశ్లేషిద్దాం..
సంతానం కలగకపోవటానికి దంపతుల ఇద్దరిలో ఉండే చిన్న చిన్న సమస్యలు కారణం కావచ్చు.. దంపతులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పిల్లలు కాకుండా ఉండవచ్చు కూడా.. అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ సమస్య ఉండొచ్చు. ఈ సమస్య కేవలం 30 శాతం మంది మహిళల్లో లోపాలవల్ల అయితే, మరో 30 శాతం వరకు పురుషుల్లో లోపాలవల్ల ఏర్పడుతోంది. 40 శాతం వరకూ స్త్రీ, పురుషులిద్దరిలోనూ కొద్దిపాటి లోపాలవల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతోంది.
పెళ్లైన మొదటి నెల నుంచే పోరు మొదలు పెట్టె పెద్దలు చాలా మందే. నిజానికి ఎలాంటి గర్భనిరోధక పద్దతులు అనుసరించకుండా ఉంటే 75 శాతం వరకు ఏడాదిలోపే గర్భం వస్తుంది. 50 శాతం మందికైతే 5 నెలలలోపే గర్భం కలగవచ్చు. రెండెళ్లలో 90 శాతం మంది మహిళలు గర్బం దాల్చవచ్చు. రెండేళ్ళ తర్వాత కూడా గర్భం రాలేదంటే మాత్రం సమస్య ఉందని సందేహించాల్సి వస్తుంది. వైద్యులను సంప్రదించి సమస్య ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ముఖ్యంగా సరైన వయసులో పెళ్లికాకపోవడం, మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండటం, సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తి, అవి సంతానలేమికి దారితీసే అవకాశాలున్నాయి.
పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు?
ఆడవారు 33%
మగవారు 33%
ఇతర కారణాలు 34%
పురుషుల్లో సంతానలేమికి కారణాలు
శుక్ర కణాలు తక్కువగా ఉండటం ముఖ్య కారణం.. మరి ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణాలు అనేకం.. మద్యం సేవించడం, పొగ త్రాగటం. అధిక బరువు. మానసిక ఒత్తిడి. తాజా పరిశోధనల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట ఫోన్‌ను అతిగా వాడడం, లేదా పక్కనే పెట్టుకుని నిద్రించడం వంటి పనులు చేస్తే అలాంటి వారికి సంతానం కలిగేందుకు చాలా తక్కువగా అవకాశం ఉంటుందని తెలిసింది.
ఆడవారిలో కారణాలు
వయస్సు… 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు.
18 లోపు & 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు
క్రమరహిత రుతుస్రావం
పెల్‌విక్ ఇన్‌ఫెక్షన్స్
టి.బి (క్షయ) వంటి రోగాలు
పొగ తాగడం, మద్యం సేవించడం.
అండాశయ సమస్యలు.