బిగ్ బ్రేకింగ్ … విశాఖకు ప్రధాని మోడీ.

-

ప్రధాని నరేంద్ర మోడి విశాఖకు రానున్నరా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని గా విశాఖను చెయ్యాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం ఆర్థిక రాజధాని గా ఉన్న విశాఖను కొత్తగా పరిపాలనా రాజధాని చేయడం ఏంటి అని విపక్షాలు అమరావతి ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు.

ఇది రాష్ట్రంలో రాజకీయ దూమారానికి కేంద్రం గా మారింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని విశాఖను పరిపాలనా రాజధాని గా చేయకుండా కేంద్రం అడ్డుకుంటుంది అని విపక్షాలు భావించాయి. దీనిపై ఇప్పటి వరకూ ప్రకటన రాకపోగా స్వయంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఒకరు అది కేంద్రం పరిదిలోని అంశం కాదంటూ రాజధాని పట్ల తమ వైఖరిని పరోక్షంగా వ్యక్త పరిచారు.
దాదాపు రెండు నెలలుగా అమరావతి కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది, ఈ తరుణంలో విశాఖ పర్యటనకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఇప్పటి వరకూ మీడియా కు ఉన్న సమాచారం మేరకు ఆయన విశాఖలో ఒక రక్షణ శాఖకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే ప్రధాని పర్యటన గురించి కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రధాని విశాఖ పర్యటన గనుక ఖరారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రులతో కూడా సమావేశమయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటన సందర్భంగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా ప్రారంభిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ ప్రధాని విశాఖ పర్యటన గనుక వాస్తవం అయితే రాజధాని మార్పు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి కొంత బలం చేకూరినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మండలి రద్దు విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండలి రద్దు బిల్లుని రాష్ట్ర శాసన సభ ఆమోదించింది కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news