పెళ్లిలో వరుడు చేత వధువుకి మెట్టెలను పెడతారు. పెళ్లి తర్వాత నుండి కూడా వధువు ఆ మెట్టెలను ఉంచుకుంటుంది. వివాహమైన ప్రతి స్త్రీ కాళ్ళకి మెట్టెలు ఉంటాయి. ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? వివాహం అయిన వాళ్ళు కాళ్ళకు మెట్టెలు ఎందుకు ధరించాలి అని… నిజానికి మెట్టెలని ధరించడం మన సంప్రదాయం మాత్రమే కాదు.
దీని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కాళ్ళకి మెట్టెలు ధరించడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. స్త్రీలు కాళ్ళకు మెట్టెలు ధరించడం వల్ల గైనిక్ సమస్యలు తొలగిపోతాయి. అలానే మెట్టెలు పెట్టుకు నడవడం వల్ల కాలి వేళ్ళ లో ఉండే నరాల పై ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి.
దీని వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నరాల ఉత్తేజితమై గైనిక్ సమస్యలు దూరం చేయడానికి ఇవి సహాయపడతాయి. బాడీ సిస్టమ్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. వివాహమైన స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్య కూడా ఉండదు. మహిళల యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. దీంతో గర్భవతి అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఈ కారణాల వల్లనే స్త్రీలు ఖచ్చితంగా కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవాలి. మెట్టెలు ధరించడం వల్ల ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి.