పెళ్ళైన ఏడాది వరకు ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి..? కారణాలు ఏంటంటే..?

-

కొత్తగా పెళ్లయిన తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఇబ్బందులు ఉంటాయి. అయితే కొత్తగా పెళ్లయిన తర్వాత ఏడాది వరకు కష్టంగా ఉంటుంది. అయితే కొత్తగా పెళ్లయిన తర్వాత ఎందుకు భార్య భర్తలు మధ్య ఇబ్బందులు వస్తాయి..? ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లయిన తర్వాత ఇద్దరూ కూడా కొత్త లైఫ్ లో అడ్జస్ట్ అవ్వాలి అందుకు టైం పడుతుంది. ఇద్దరూ కూడా వేరువేరు కుటుంబాల నుంచి వస్తారు. వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ కూడా మారుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి.

lover

ఒకదాని నుంచి ఇంకోదానికి మారడానికి కాస్త టైం పడుతుంది కష్టంగా అనిపిస్తుంది. భవిష్యత్తు గురించి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. లైఫ్ అంతా మారిపోతుందని.. వాళ్ళు అనుకున్నట్లే ఉంటుందని.. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటారని ఇలా చాలా ఊహించుకుంటారు. కానీ అన్ని జరగవు. ప్రతిరోజు ఒక ఛాలెంజ్ అవుతుంది. అలాగే కొత్తగా పెళ్లయినట్లయితే కమ్యూనికేషన్ విషయం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో లోపాలు ఉంటాయి. అపార్థాలు, గొడవలు కూడా పెరుగుతాయి.

సర్దుకోవడానికి టైం పడుతుంది. ఒక ఏడాది వరకు పడుతుంది. అలాగే ఇద్దరు కూడా వేర్వేరు కుటుంబాల నుంచి వేరు వేరు సంప్రదాయాల నుంచి వస్తారు. కనుక చాలా తేడాలు ఉంటాయి. ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఓపికతో ఉండడం మంచిది. ఖర్చులు కూడా చాలా మార్పు వస్తుంది మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. గొడవలు కూడా రావచ్చు. ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఇది వరకులా కావాల్సినవి కొనుక్కోలేరు. ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ కూడా భారంగా అనిపిస్తుంది. గొడవలు కూడా వస్తాయి. ఇలా కొత్తగా పెళ్లయిన వాళ్లకు ఈ సమస్యలు వచ్చి ఏడాది వరకు ఇబ్బందులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version