ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్సీ బెదిరింపులు.. తెరుచుకున్న చికెన్, మటన్ షాపులు

-

హైదరాబాద్‌‌లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమంగా దాడులు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా కల్తీ ఆహారం సరఫరా చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ -పాతబస్తీ మోతీ మార్కెట్లో అపరిశుభ్రంగా, ఎలుకలు తిరుగుతున్న చికెన్ షాపును, 70 కిలోల చికెన్‌ను జీహెచ్ఏంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్‌.. సీజ్ చేసిన షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను బెదిరించినట్లు సమాచారం.

దీంతో సీజ్ చేసిన 24 గంటల్లోనే షాపులను తెరుచుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులిచ్చారు. ఎంఐఎం నేతల బెదిరింపులపై జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మండిపడ్డారు. హైదరాబాద్ వాసులు కల్తీ ఆహారంతో ఇబ్బందులు పడొద్దు. ఫుడ్ సేఫ్టీ అధికారులపై, ఎంఐఎం నేతల బెదిరింపులు సరైనవి కావంటూ నగర మేయర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version