‘బాడీగార్డ్’లు నల్ల కళ్ల అద్దాలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

-

సాధారణంగా బయట లేదా టీవీలలో మీరు చూసే ఉంటారు. బాడీగార్డ్ లు నల్ల కళ్ల అద్దాలు ధరించి రైఫిల్స్ చేతిలో పట్టుకుని. ఎంతో హుందాగా నిలబడి ఉంటారు. మరి ఎందుకు వీళ్లు ఎప్పుడు నల్లని సన్ గ్లాస్ ని పెట్టుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా పెట్టుకోవడం వారికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా? అని ఆలోచించారా. అయితే ఇక్కడ ఎందుకు అలా సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

భద్రతా సిబ్బంది వారు ఒకే చోట నిలుచున్న కానీ వారి కళ్ళు మాత్రం మొత్తం ప్రాంతం అంతా చూస్తూ ఉంటాయి. సన్ గ్లాస్ ని ధరించడం వల్ల దాడి చేసేవారు భద్రతా సిబ్బంది చూడలేరు. అందువల్ల దాడి చేయడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటి వారిని తొందరగా పసిగట్టడానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు.

ఫీల్డ్ లేదా బహిరంగ ప్రదేశంలో పొగమంచు లేదా మురికిగా ఉన్న ప్రాంతాలలో భద్రతా సిబ్బంది కళ్ళను రక్షిస్తాయి. ఇంకా పొగమంచు సమయంలో కూడా స్పష్టంగా కనపడడానికి ఉపయోగపడతాయి. భద్రతా సిబ్బంది ప్రాథమిక లక్ష్యం అనవసరమైన దాడుల నుంచి వారి లక్ష్యాన్ని రక్షించడమే అటువంటి సమయంలో వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి నల్లటి అద్దాలను ధరిస్తారు.

చిన్న పేలుళ్ళు లేదా శిథిలాలు ఎగిరి పడుతున్నప్పుడు అదే వారి కళ్ళను రక్షిస్తుంది. ఈ సన్ యొక్క గాజు ప్రత్యేకంగా సృష్టించబడింది. కాబట్టి ఎటువంటి నష్టం లేకుండా పేలుడు వంటి పదార్థాలను స్పష్టంగా చూడగలరు. డార్క్ గ్లాసెస్ ప్రత్యక్ష సూర్యకాంతి ఇంకా మెరుపులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కంటికి తటస్థ బ్లాక్ టోన్ ఇస్తుంది. ఇది రంగు పరిమితులను మించి చూడడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల భద్రతా సిబ్బంది తక్కువ రెప్పపాటు ఇంకా ఎక్కువ సమయం కళ్ళు తెరిచి ఉంచడానికి సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version