అత్తా, కోడళ్ళు ఎందుకు గొడవ పడతారో తెలుసా?

-

ఆరోజుల్లో, ఈరోజుల్లో అన్నీ మారాయి. కానీ అత్తా కోడళ్ల మధ్య వైరం మారలేదు.. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఏదో ఒక చిన్న అంశంలోనైనా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయి చర్చ జరుగుతుంది. అది కాస్త గొడవకు దారి తీస్తుంది. చాలా ఇళ్లల్లో వేరు కాపురాలు పెట్టుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ఒక ఐడియా ఉంటుంది. మరి ప్రతి ఇంట్లో అసలు గొడవలు ఎక్కడ మొదలవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇది చెయ్యడం ముఖ్యం.. అప్పుడే సొల్యూషన్ కూడా దొరుకుతుంది.. అస్సలు కోడళ్లు తమ అత్తలను ఎందుకు ఇష్టపడరు, ఏయే విషయాల్లో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

తన భర్తను చిన్న పిల్లాడిలా చూడటం..పెళ్లైన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని తల్లికి చెప్పాలని కోరుకోవడం కోడళ్లకు నచ్చదు. ఇది దంపతుల మధ్య సంబంధంపై ప్రభావం చూపిస్తుంది.. ఇది నిజమే కాదా.. అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా.. దంపతులు ఎవరికైనా ప్రైవసీ చాలా చాలా ముఖ్యం. దంపతుల మధ్యలోకి వెళ్లాలని ఎప్పటికీ అనుకోవద్దు. ఈ విషయాన్ని కొంత మంది అత్తలు పట్టించుకోరు. నా కొడుకే కదా అనే ధోరణితో ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. దీని వల్ల ప్రైవసీ లేదని కోడళ్లకు అనిపిస్తుంది.. దానివల్లే గొడవలు జరుగుతాయి..

పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని ఆర్డర్ వెయ్యడం.. పెళ్లి అయిన మొదటి నెల నుండే స్టార్ట్ చేస్తుంటారు. ఏదైనా విశేషమా అంటూ వెంట పడుతుంటారు. అయితే పెళ్లి అయ్యాక దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కొంత సమయం అవసరం. అలాగే పిల్లలు కనడానికి మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా ఏదైనా విశేషమా అని అడుగుతుంటే కోడళ్లకు ఎక్కడ లేని కోపం వస్తుందట..కొన్ని పనులు అత్తలు చేసినట్లుగానే కోడళ్లు చేయలేకపోవచ్చు, మరికొన్ని పనులు అసలు చేయడమే తెలియకపోవచ్చు.. అలాంటి సందర్భంలో మీ అమ్మానాన్నలు ఇలాగే పెంచారా, పెంపకం అంటే ఇలాగే ఉంటుందా అని అవమానించడం వల్ల కోడళ్లు సహనం కోల్పోతారు.తన కొడుకును ఎలా పెంచిందో ఆలోచించాలి..ఇక చివరిగా వంట విషయంలో.. యుద్ధమే.. చిన్న విషయానికి కూడా మీద పడి అరుస్తారు ఇవే ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య గొడవలకు దారి తీస్తాయి.. ఇదండి అసలు కథ..

Read more RELATED
Recommended to you

Exit mobile version