మీ ముఖం షేప్‌ను బట్టి.. మీకు సెట్టయ్యే హెయిర్‌ కట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి..!

-

డ్రెస్సులకు రకరకాల సైజులున్నట్టే.. హెయిర్ కట్ లో కూడా రకరకాల స్టయిల్స్ ఉంటాయి. ఒకరికి ఒక హెయిర్ కట్ సెట్ అవ్వొచ్చు. మరొకరికి మరో హెయిర్ కట్ సెట్ అవొచ్చు. ఒకరికి సెట్ అయిన హెయిర్ కట్ మరొకరికి సెట్ కాకపోవచ్చు. మరొకరికి సెట్ కానింది ఇంకొకరికి సెట్ అవచ్చు.

ముఖం షేప్ ను తెలుసుకోవడం ఎలా?

మీకు ఏ హెయిర్ కట్ సెట్ అవుతుందో తెలుసుకునే ముందు.. మీది ఫేస్ షేప్ ఏంటో తెలుసుకోవాలి. దాని కోసం.. మీ ఫేస్ కు సంబంధించి కొన్ని కొలతలు తీసుకోవాలి. ముఖం ముందు భాగం అంటే.. ఫోర్ హెడ్ కొలత తీసుకోవాలి. తర్వాత చీక్ బోన్స్ అంటే.. కంటి బయటి బాగాన్ని లెక్కించడం, జాలైన్ అంటే దవడ నుంచి చెవుల వరకు లెక్కించడం, తర్వత మీ ముఖం పొడవును లెక్కించండి. ముఖం పొడవు కోసం… జుట్టు కింది నుంచి దవడ కింది వరకు లెక్కించండి.

ఈ లెక్కల ద్వారా మీది ఏ ముఖమో గుర్తించొచ్చు. నిజానికి.. ఎవరికైనా 6 రకాల ముఖాల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓవల్, స్క్వైర్, రెక్టాంగిల్, రౌండ్, డైమాండ్, హార్ట్, ట్రయాంగులర్… వీటిలో ఏదో ఒక ఫేస్ ఉంటుంది. చీక్ బోన్స్ కన్నా ముఖం పొడవు ఎక్కువగా ఉంటే మీది ఓవల్ ఫేస్ అన్నమాట. అన్ని కొలతలు సమానంగా ఉంటే అది స్క్వైర్ ముఖం, ఫేస్ పొడవు అన్నింటికన్నా ఎక్కువగా ఉండి… మిగితా కొలతలన్నీ సమానంగా ఉంటే అది రెక్టాంగిల్ ఫేస్, చీక్ బోన్స్, ఫేస్ లెన్త్ సమానంగా ఉంటే అది రౌండ్ ఫేస్, ఫేస్ లెన్త్ ఎక్కువగా ఉండి.. మిగితావి చీక్ బోన్స్, ఫోర్ హెడ్, జాలైన్.. ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటే అది డైమాండ్ ఫేస్, ఫోర్ హెడ్ కొలతలు చీక్ బోన్స్, జాలైన్ కంటే ఎక్కువగా ఉంటే అది హార్ట్ ఫేస్, జాలైన్ కొలతలు మిగితా చీక్ బోన్స్, ఫోర్ హెడ్ కన్నా ఎక్కువగా ఉంటే అది ట్రైయాంగులర్ ఫేస్.

ఓవల్ ఫేస్(కోల ముఖం) ఉంటే…

కోల ముఖం ఉన్న వాళ్లకు చిన్న హెయిర్ కట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. వెనుక, సైడ్స్ కూడా చిన్నగా కట్ చేయించాలి. పైన కొంచెం పెద్దగా ఉండాలి. ఉదాహరణకు ఈ ఫోటోలు చూడండి.

స్క్వైర్ ఫేస్ (చదరపు ముఖం) ఉన్నవాళ్లు

ఈ ఫేస్ ఉన్నవాళ్లకు ఎటువంటి స్టయిల్ అయినా బాగానే ఉంటుంది. చిన్న హెయిర్ కట్… పెద్ద హెయిర్ కట్ ఏదైనా సూపర్బ్ గా సెట్ అవుతుంది. కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి..

రెక్టాంగిల్ ఫేస్

ఇది అన్ని ఫేసుల్లోనూ పెద్దది. ఓవల్, స్క్వైర్ షేప్ మధ్యలో ఉంటుంది ఈ ఫేస్. పైన పొడవుగా జుట్టును ఉంచితే… సైడ్స్ ను మరీ చిన్నగా కత్తిరించకండి. ఉదాహరణకు ఈ ఫోటోలు చూడండి.

రౌండ్ ఫేస్ (గుండ్రని ముఖం)

గుండ్రని ముఖం ఉన్నవాళ్లు హెయిర్ స్టయిల్ తో పాటు గడ్డంను కూడా కాసింత పెంచుకోవాలి. స్టయిల్ గా గడ్డాన్ని పెంచుకొని… పైన కొంచెం ఎక్కువగా ఉంచుకొని… సైడ్స్ ను టైట్ గా కట్ చేయించుకోండి. ఉదాహరణకు ఈ ఫోటోలు చూడండి.

డైమండ్ షేప్

డైమండ్ షేప్ ఉండటం చాలా అరుదు. ఎందుకంటే… వాళ్ల దవడ, నుదురు చిన్నగా ఉంటుంది. ముఖం పైన ఫోర్ హెడ్ మీద ఎక్కువ హెయిర్ ఉంటే ఈ షేప్ వాళ్లకు బాగుంటుంది. సైడ్ లను చిన్నగా కత్తిరించుకోకండి. ఉదాహరణకు..

హార్ట్ ఫేస్

ఈ ఫేస్ ఉన్నవాళ్లు.. చిన్న హెయిల్ కట్ ను అవాయిడ్ చేయండి. ఈ ఫేస్ ఉన్నవాళ్లు కూడా గడ్డాన్ని ఉంచుకుంటే వాళ్ల హెయిర్ సూపర్బ్ గా కనిపిస్తుంది.. ఉదాహరణకు…

ట్రయాంగిల్ ఫేస్

ఫోర్ హెడ్ వీళ్లకు తక్కువగా ఉంటుంది. జాలైన్ వెడల్పుగా ఉంటుంది. హార్ట్ షేప్ ముఖం ఉన్నవాళ్ల హెయిర్ స్టయిల్ కు ఇది పూర్తి విరుద్ధంగా ఉండాలి. క్లీన్ షేవ్ ఉంటే ఇంకా బాగుంటుంది.. ఉదాహరణకు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version