ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు ఇష్ట పడడం చాలా ముఖ్యం. నిజంగా వాళ్ళని వాళ్ళు ఇష్టపడితే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక పోవచ్చు. కానీ ఇది చాలా ముఖ్యం. అయితే ఎందుకు వాళ్ళని వాళ్ళు ఇష్టపడాలి..?, ఒక వేళ వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కానీ కొందరిలో ఇది ఉండదు దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఇష్ట పడరో వాళ్ల మీద వాళ్ళకి అసలు జీవితంలో నమ్మకం ఉండదు. వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం లేక పోతే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సాధించలేరు. అదే విధంగా ఏ పని చేసినా కష్టమవుతుంది.
సెల్ఫ్ లవ్ లేక పోవడం వల్ల మొదట ఇతరుల నుంచి వాళ్ళకి సానుభూతి అందుతుంది. అంతే కానీ ఇతరులు వాళ్ళని ప్రేమించరు. దీని కారణంగా వాళ్లల్లో ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి.
అదే విధంగా ఎవరైతే వాళ్లని వాళ్ళు ప్రేమించరో వాళ్లు దృఢమైన రిలేషన్ షిప్ ని పొందలేరు ఎందుకంటే ఎప్పుడూ తనని తాను ద్వేషిస్తూ ఉంటాడు కనుక.
అలానే ఎప్పుడు చూసినా ఇరిటేషన్ తో ఉంటాడు దీని కారణంగా మంచి రిలేషన్ షిప్ లో ఉండలేరు.
తనను తాను ధ్వేషించుకోవడం వల్ల ఇతరుల మీద నమ్మకం కూడా తనకి ఉండదు. తన లాగే అందరూ ఉంటారని అనుకుంటూ ఉంటాడు. ఎవరైతే తనని తాను ప్రేమించుకోలేరో వాళ్ళు ఇతరులని ప్రేమించలేరు దీంతో జీవితాంతం తను ప్రేమని పొందలేడు.