కాంగ్రెస్ కు పిచ్చి పట్టింది…నిర్మాలా సీతారామన్

-

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దీంతో వారికి పిచ్చిపట్టిందని రక్షణ శాఖ  మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు.  రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో  రాఫెల్ ఒప్పందంపై ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలెండ్ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ మోదీపై వివాదస్పద కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రధాని మోదీని దొంగగా పేర్కొంటూ రాహుల్ వ్యాఖ్యలు చేయడంతో భాజపా  నేతలు రాహుల్‌పై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడయా సమావేశంలో నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ కూడా దొంగల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తేనని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టత ఇచ్చినా  రాహుల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ నేతలకు అధికారం కోల్పోయేసరికి పిచ్చిపట్టిందన్నారు. ‘‘దొంగల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి రహస్యం లేదన్నారు. మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా భాజపాను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని తట్టుకోలేని కాంగ్రెస్.. మోదీపై బురద జల్లె ప్రయత్నం చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అనవసర ఆరోపణలతో మోదీ ప్రభను తగ్గించలేరని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version