ఇటీవల జరిగిన కేరళ వరద బీభత్సం గురించి అందరి తెలిసిందే. భారీ వరదల వల్ల చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన కేరళ వరదలకు సోషల్ మీడియా బాగా సపోర్ట్ గా నిలిచింది. ఇదిలాఉంటే కేరళ వరద బీభత్సాన్ని సినిమాగా తీయాలని చూస్తున్నారట మళయాల దర్శకుడు జుదే ఆంటోనీ జోసెఫ్.
కేరళలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపిస్తారట. ఇద్దరు ముగ్గురు ఈ విధ్వంసాన్ని షార్ట్ ఫిల్మ్ గా తీద్దామని ప్రయత్నించారట కాని తాను తీసేది ఫీచర్ ఫిల్మ్ అంటున్నాడు జోసెఫ్. ఇక ఈ సినిమాకు టైటిల్ గా 2043 ఫీట్ అని నిర్ణయించారట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయట.
ఈ సినిమా కోసం హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేరళ ఫ్లడ్స్ మీద తీస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.