కాంగ్రెస్ లో కీలక పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి

-

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే టీపీసీసీకి ఇద్దర్ని వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటుచేసింది. దీంతో పాటు 53 మందితో కో – ఆర్డినేషన్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీని నియమించింది.

టి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్:   రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

ప్రచార కమిటీ చైర్మన్: మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి

తెలంగాణ మేనిఫెస్టో చైర్మన్:  దామోదర రాజనర్సింహ,

కన్వీనర్: దాసోజు శ్రావణ్, కో చైర్మన్: డీకే అరుణ

స్ట్రాటజీ అండ్ ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌: వి.హనుమంతరావు‌

ఎన్నికల కమిటీ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌: మర్రి శశిధర్‌రెడ్డి

పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌: కోదండరెడ్డి

కోర్ కమిటీ సభ్యులు: కుంతియా, బోస్‌రాజు, శ్రీనివాసన్‌కృష్ణన్, సలీం అహ్మద్, ఉత్తమ్, , వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క , జానారెడ్డి, షబ్బీర్ అలీ , చిన్నారెడ్డి, సంపత్ కుమార్  రాజనర్సింహ, మధుయాష్కి, , వంశీచంద్‌ రెడ్డిలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి కో ఆర్డినేషన్ కమిటీలో చోటు కల్పించడంతో పాటు మరో మూడు కమిటీల్లో ఆయనకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై  సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version