మోదీజీ.. అమరావతికి రండి: సీఎం చంద్రబాబు

-

దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డిఏ సర్కార్ ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. మోదీని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలో నిత్యం ముందుకు వెళతామని తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని ఆహ్వానించారు చంద్రబాబు. మోడీకి ఏ సమస్య చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటారని.. పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపిస్తారని కొనియాడారు.

గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యం అని అన్నారు చంద్రబాబు. ఇందుకోసం కేంద్రం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుందని.. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి జరుగుతుందని.. పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు.

ప్రపంచవ్యాప్తంగా అరకు బ్రాండ్ కి విలువ పెరగడానికి ప్రధాని మోదీనే కారణమని తెలిపారు. రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడికి సిద్ధమైన తరుణంలో తాను ప్రధాని మోదీని కలిశానని అన్నారు. ఆ సందర్భంలో టాక్స్ సిస్టం గురించి మాట్లాడుకున్నామని వివరించారు. భవిష్యత్తులో టాక్స్ పాలసీ మారితే పరిస్థితి ఏంటని తాను మోదీని ప్రశ్నించానని.. అలాంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే దేశానికి పెట్టుబడులు రావని మోడీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version