కిడారి – సోమ హత్యలపై స్పందించిన మావోయిస్టులు

-

 


ఏజెన్సీ ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి దోపిడీ కార్యకలాపాలు చేయడం వల్లనే వారిని కాల్చిచంపామని మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు ఏవోబీ ప్రతినిధి జగబందు పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.‘ఏజెన్సీలో లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలు కిడారి నిర్వహిస్తున్నారు. వాటిని నిలిపివేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటే వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ అణచివేతకు ప్రతీకారణంగానే కిడారి, సోమలపై చర్యలు తీసుకున్నాం’ అని జగబందు ఆ లేఖలో పేర్కొన్నారు.మైనింగ్ ని వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బానాయించి ఇబ్బందులు పెట్టారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ తో కలిసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు వారించిన వినలేదని అందుకే కిడారి, సోమలను హతమార్చినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version