కీచక సీఐ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి..సీఎం

-

 

చిత్తూరు జిల్లా వాయిల్పాడు సీఐ తేజోమూర్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పీలేరు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పట్ల ఇన్ చార్జ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న తేజో మూర్తి  అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపించింది. తన కోరిక తీర్చకపోతే కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో పాటు, డీఎస్పీతో మాట్లాడిస్తానని చెప్పి మదనపల్లికి రప్పించిన తేజో మూర్తి, తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడాని దీంతో  ఆ సమయంలో తాను తప్పించుకున్నాని బాధిత మహిళ వాపోయింది. తిరుపతి బ్రహ్మొత్సవాల సందర్భంగా స్పెషల్ డ్యూటీ నిర్వహిస్తున్న తేజో మూర్తి ఆ మహిళకు ఫోన్ చేసి నందకం గెస్ట్ హౌస్ లో ఓ గదిని బుక్ చేశానని ఉదయం 5 గంటల్లోగా అక్కడకు రావాలని సీఐ చెప్పిన వాయిస్ రికార్డ్ ను  ఆమె బయటపెట్టింది.

ఈ క్రమంలో మంగళవారం మహిళా సంఘాలతో కలిసి ఆ మహిళ తిరుమలకు వచ్చి..తిరుపతి అర్బన్ ఎస్పీ మహంతిని కలిసి వాట్సాప్ మెసెజ్ లు, కాల్ వాయిస్ రికార్డులను సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్నూలు రేంజి డీఐజీ శ్రీనివాస్ తేజోమూర్తిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వూలిచ్చారు.

 

మహిళ పట్ల సీఐ వ్యవహరించిన తీరుని మీడియా ద్వారా తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలో ఇలాంటివి జరిగితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version