చూశారుగా పైన ఫోటో.. ఆ అబ్బాయి చేతులు ఎంత పెద్దగా ఉన్నాయి. కాళ్లలా పెరిగాయి చేతులు. ఆ అబ్బాయి పేరు తారిక్. ఇప్పుడు కాదు అతడు పుట్టినప్పటి నుంచే అతడి చేతులు చాలా పెద్దగా ఉండేవట. ఇక.. ఆ బాలుడు పెరిగి పెద్దవుతున్నాకొద్దీ అతడి చేతులు కూడా పెరగడం ప్రారంభించాయట. అతడి తండ్రి బతికున్నప్పుడు లోకల్ డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాడట. కొన్ని మందులు కూడా వాడారు. కానీ.. ఆ అంతుచిక్కని వ్యాధి మాత్రం తగ్గలేదు.
ఇప్పుడు ఆ బాలుడి తండ్రి కూడా లేడు. చనిపోయాడు. కన్నతల్లి మాత్రమే మనోడి ఆలనా పాలనా చూసుకోవాలి. పేదరికంతో సరైన చికిత్స అందించలేకపోతున్నది ఆ తల్లి. పెద్ద పెద్ద చేతలు కావడంతో ఆ చేతులతో ఏ పని చేయలేడు. అన్నం కూడా ఒకరు తినిపించాలి. బట్టలు వేరే వాళ్లు వేయాలి. అలా.. ప్రతి పనిలో తారిక్ కు ఓ తోడు అవసరం. అతడి అన్నయ్యే ఆ బాలుడిని చూసుకుంటాడు.
మామూలుగా నడుస్తున్నా కూడా తారిక్ చేతులు నొప్పి పుడతాయట. వాటిని మోయలేక విచిత్రమైన రోగంతో నరకం అనుభవిస్తున్నాడు తారిక్. ఇక ఇంటి నుంచి బయటికి వెళ్తే మాత్రం అతడి చేతులు చూసి అంతా నవ్వుతారట. డాక్టర్లకు కూడా అంతుపట్టట్లేదు ఈ వ్యాధి.
తారిక్ సమస్య ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇటువంటి సమస్యతో బాధ పడే వాళ్లను ఎవరినీ ఇంతవరకు చూడలేదు. ఎలిఫెంట్ ఫూట్ డిసీజ్ లా కనిపిస్తున్నది ఇది. అతడి సమస్యను నయం చేయడం చాలా కష్టం. కానీ.. ఇది టెక్నాలజీ యుగం. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. అని చెబుతున్నారు డాక్టర్లు.