ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చిన వారెంట్ల పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా ముఖ్యనేతలు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో ఏమైన నోటీసులు, వారెంట్లు వచ్చాయా అంటూ సంబంధిత అధికారులను అడిగారు..దీంతో వారు స్పందిస్తూ.. తాజాగా జారీ అయినా వారెంట్ మాత్రమే అందింది గతంలో ఎలాంటివి రాలేదు అని వివరించారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అనగా.. రీకాల్ పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవొచ్చూ… దీనితో పాటు ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెదేపా సీనియర్ నేతలు బాబుకు సూచించారు.
ఒక కోర్టుకు హాజరైతే మీ వెంట రైతులూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ తెదేపా నేతలు సీఎంతో వివరించారు. ఈ విషయమై మరో సారి చర్చించి తుది నిర్ణయం తీసుకొనున్నారు. బాబ్లీ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశమైందని అధికారులు బాబుకు తెలిపారు. వారెంట్ జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉన్నట్లు తెటతెల్లమవుతోందని తెదేపా నేతలు వివరించారు.